పెన్సిల్వేనియా కోర్టులో ట్రంప్‌కు చుక్కెదురు

ABN , First Publish Date - 2020-11-23T07:21:46+05:30 IST

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని పెన్సిల్వేనియా కోర్టులో ట్రంప్‌ వేసిన పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. సరైన ఆధారాలు సమర్పించలేదని న్యాయస్థానం వెల్లడించింది. సుమారు 7 లక్షల ఓట్లను పరిగణనలోకి తీసుకోకూడదని ట్రంప్‌ పిటిషన్‌లో పేర్కొన్నారని...

పెన్సిల్వేనియా కోర్టులో ట్రంప్‌కు చుక్కెదురు

వాషింగ్టన్‌, నవంబరు 22: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని పెన్సిల్వేనియా కోర్టులో ట్రంప్‌ వేసిన పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. సరైన ఆధారాలు సమర్పించలేదని న్యాయస్థానం వెల్లడించింది. సుమారు 7 లక్షల ఓట్లను పరిగణనలోకి తీసుకోకూడదని ట్రంప్‌ పిటిషన్‌లో పేర్కొన్నారని, ఇలాంటి ఆరోపణలు చేసినప్పుడు పిటిషనర్‌ నిర్దిష్టమైన ఆధారాలతో రావాలని కోర్టు అభిప్రాయపడింది. కాగా, తమకు కోర్టులో ఆధారాలు సమర్పించే అవకాశం కూడా ఇవ్వలేదని ట్రంప్‌ ప్రచార బృందం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఒబామా నియమించిన ఈ జడ్జి అభిప్రాయంతో తాము విభేదిస్తున్నామని పేర్కొంది. తాము సుప్రీం కోర్టుకు త్వరగా వెళ్లేందుకు అవకాశం ఏర్పడిందని తెలిపింది. కాగా, అమెరికా కొత్త అధ్యక్షుడిగా జో బైడెన్‌ ఎన్నికను తాము లాంఽఛనంగా గుర్తించబోమని రష్యా అధినేత వ్లాదిమిర్‌ పుతిన్‌ స్పష్టం చేశారు. అధికారికంగా ప్రస్తుతం గుర్తించలేమని పేర్కొన్నారు.


Updated Date - 2020-11-23T07:21:46+05:30 IST