పల్లీలు తినాలంటే అమ్మో.. Fat వస్తుందనే అపోహను వదిలి.. ఒక్కసారి ఈ విషయాలు తెలుసుకుంటే మళ్లీ మళ్లీ తింటారు!

ABN , First Publish Date - 2021-10-23T15:01:46+05:30 IST

చాలామంది పల్లీలు తినాలంటే అమ్మో.. ఫ్యాట్‌, శరీరంలో కొవ్వు చేరుతుంది అని దూరంగా ఉంటారు. కానీ ...

పల్లీలు తినాలంటే అమ్మో.. Fat వస్తుందనే అపోహను వదిలి.. ఒక్కసారి ఈ విషయాలు తెలుసుకుంటే మళ్లీ మళ్లీ తింటారు!

హైదరాబాద్ సిటీ/నార్సింగ్‌ : చాలామంది పల్లీలు తినాలంటే అమ్మో.. ఫ్యాట్‌, శరీరంలో కొవ్వు చేరుతుంది అని దూరంగా ఉంటారు. కానీ వారు ఆ ఆపోహను తొలగించుకోవాలి. పల్లీలను మితంగా తింటే ఏమీ కాదు. పల్లీలే కాదు ఫ్యాట్‌ లేని వస్తువు ఏది అధికంగా తిన్నా నష్టమే. మరి పల్లీలు తినడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయో చూద్దాం..


- ఉడికించిన, వేయించిన పల్లీ రుచేరుచి! అయితే వీటిని ఎక్కవ తింటే కొలెస్ర్టాల్‌ పెరిగిపోతుందనే భయంతో... అసలు తినకుండా మానేస్తారు. అది మంచిపద్ధతి కాదు. అప్పుడప్పుడు పల్లీలు తింటే ఆరోగ్యానికి ఎంతో మంచింది. 

- పల్లీలలో విటమిన్లు, ఖనిజాలు, పోషక విలువలతో పాటు, యాంటీ ఆక్సిడెంట్స్‌ పుష్కలం. 


- రోజూ కొన్ని పల్లీలు తింటే శరీరంలో పేరుకుపోయిన చెడుకొవ్వు తొలగిపోతుంది. ఇందులోని మోనో శాచురేటెడ్‌ ఫ్యాట్స్‌ ప్రత్యేకించి ఓలిక్‌ యాసిడ్‌ గుండెజబ్బుల్ని రాకుండా అడ్డుకుంటుంది. 

- పీనట్స్‌కు అత్యధిక ప్రొటీన్లు అందించే గుణం ఉంది. అమినో ఆసిడ్స్‌ శరీరారోగ్యాన్ని మరింత మెరుగుపరుస్తాయట. 

- ఈ రోజుల్లో ఉదరకోశ వ్యాధులు, పెద్ద, చిన్న పేగులకొచ్చే కేన్సర్లు అధికం. పల్లీల్లోని పోలీఫినోనిక్‌ యాంటీ ఆక్సిడెంట్స్‌ కడుపులో వచ్చే కేన్సర్లను రానివ్వవు. నరాల జబ్బులు, వైరల్‌, ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లనూ కూడా అడ్డుకుంటాయి. వీటిలోని నైట్రిక్‌ ఆక్సైడ్‌ గుండెపోటును రాకుండా కాపాడుతుంది.

- శరీరానికి కొన్నిసార్లు బీ కాంప్లెక్స్‌ తక్కువై పలు సమస్యలు వస్తాయి. వేరుశనగ తినేవాళ్లలో ఈ సమస్య తక్కువ. విటమిన్‌ బి6, బి9లతో పాటు మరిన్ని విటమిన్లు అందుతాయి. 

- పోటాషియం, మెగ్నీషియం, కాపర్‌, కాల్సియం, ఐరన్‌, సెలీనియమ్‌, జింక్‌ వంటి ఖనిజాలకు వేరుశనగలో కొదవ లేదు. శరీరంలోని అన్ని అవయవాలకు తగిన శక్తిని అందిస్తుంది వేరుశనగ.


- విదేశాల్లో పీనట్స్‌తో తయారైన బటర్‌ను విరివిగా వాడుతుంటారు. ఈ రకం బటర్‌ వల్ల గాల్‌బ్లాడర్‌ జబ్బులు దరిచేరవట. 25 శాతం రిస్క్‌ తక్కువని పరిశోధనలు చెబుతున్నాయి.

- ముఖ్యంగా మహిళలు పీనట్స్‌ బటర్‌ను వారానికి రెండుసార్లు బ్రెడ్‌స్లయిసె‌స్‌కు రాసుకొని తింటే మంచిది. కొలోన్‌ కేన్సర్‌ ముప్పు తప్పుతుంది. ఈ విషయం పలు పరిశోధనల్లో రుజువైంది.

- శరీరంలోని మెటాబాలిజాన్ని చురుగ్గా ఉంచి... షుగర్‌లెవెల్స్‌ను చక్కదిద్ది... ఆరోగ్యంగా ఉంచుతుంది వేరుశనగ.

- సెరటోనిన్‌ లెవల్స్‌ పడిపోతే... డిప్రెషన్‌కు లోనయ్యే ప్రమాదం ఉంది. ఆ లోటును తీరుస్తుంది పల్లీ. ఇవేకాదు, చర్మకాంతికి, జుట్టు నిగనిగలాడేందుకు పల్లీలు ఎంతో ప్రయోజనం.

Updated Date - 2021-10-23T15:01:46+05:30 IST