తాలిబన్ రాజ్యంతో ఔషధాల కొరత... వైద్యం అందక జనం మృతి!

ABN , First Publish Date - 2021-09-09T13:15:05+05:30 IST

అఫ్ఘానిస్తాన్‌లో తాలిబన్ల అరాచక రాజ్యం కొనసాగుతోంది.

తాలిబన్ రాజ్యంతో ఔషధాల కొరత... వైద్యం అందక జనం మృతి!

కాబుల్: అఫ్ఘానిస్తాన్‌లో తాలిబన్ల అరాచక రాజ్యం కొనసాగుతోంది. ఈ నేపధ్యంలో అక్కడి ప్రజలు పడరానిపాట్లు పడుతున్నారు. ముఖ్యంగా ఆరోగ్య సేవలు అందక బాధితులు విలవిలలాడిపోతున్నారు. డాక్టర్స్ విథవుట్ బార్డర్స్ పేరుతో ప్రాచుర్యం పొందిన ఫ్రాన్స్ సంస్థ మెడికల్ సైన్స్ ఫ్రంటియర్స్(ఎంఎస్ఎఫ్) తన నివేదికలో పలు ఆసక్తిక వివరాలు వెల్లడించింది. అఫ్ఘనిస్తాన్ ప్రజలు ఇకపై తూటాలు, బాంబు దాడులతోనే కాకుండా వైద్య సేవలు అందక పెద్ద సంఖ్యలో మరణిస్తారని ఆ నివేదిక పేర్కొంది. 


ఈ సందర్భంగా ఎంఎస్ఎఫ్ సభ్యుడు మార్టిన్ ఫ్లోక్‌స్ట్రా మాట్లాడుతూ యుద్ధవాతావారణం తాండవిస్తున్న ప్రస్తుత అఫ్ఘానిస్తాన్‌లో పరిస్థితులు మరింత దారుణంగా మారాయన్నారు. అఫ్ఘానిస్తాన్‌ను తాలిబన్లు ఆక్రమించాక  అమెరికాతో సహా అన్నిదేశాలు ఇటువైపు దృష్టి సారించడం మానివేశాయి. ఫలితంగా తాలిబన్ల ఆటవిక రాజ్యం యథేచ్ఛగా కొనసాగుతోంది. ముఖ్యంగా వైద్య సేవలు నిలిచిపోవడంతో స్థానికులు పెద్ద సంఖ్యలో మరణిస్తున్నారు. ఇక్కడ పనిచేస్తున్న వైద్యులకు, వైద్య సిబ్బందికి కొన్ని నెలలుగా జీతాలు అందడం లేదు. దీంతో వీరు విధులు నిర్వహించేందుకు అనాసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం మందులకు తీవ్ర కొరత ఏర్పడింది. అనునిత్యం అంబులెన్సులు బాధితులను ఆసుపత్రులకు తరలిస్తున్నాయని తెలిపారు.

Updated Date - 2021-09-09T13:15:05+05:30 IST