Abn logo
Apr 7 2020 @ 11:32AM

విజయవాడ పాతబస్తీలో కనిపించని లాక్‌డౌన్..

విజయవాడ: విజయవాడ పాతబస్తీలో లాక్‌డౌన్ ఎక్కడా కనిపించడం లేదు. అత్యధికంగా పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతంలోనే ప్రజలు నిబంధనలు బేఖాతరు చేస్తుండటం గమనార్హం. ప్రజలు నిబంధనలు ఉల్లంఘిస్తూ వాహనదారులు యథేచ్ఛగా రోడ్లపై రాకపోకలు సాగిస్తున్నారు. ప్రజలు యథావిధిగా రోడ్లపై సంచరిస్తున్నా పోలీసులు ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. మరోవైపు డబ్బుల కోసం జనం బ్యాంకుల వద్ద బారులు తీరారు.


Advertisement
Advertisement
Advertisement