వైసీపీ పాలనలో ఏపీని ‘బీహార్‌ ఆఫ్ సౌత్’ అని పిలుస్తున్నారు: చంద్రబాబు

ABN , First Publish Date - 2020-06-03T02:16:27+05:30 IST

వైసీపీ ప్రభుత్వంపై మాజీ సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి విమర్శల వర్షం కురిపించారు. రాష్ట్రంలో పెరుగుతున్న హింసాత్మక ఘటనలతో ఏపీని అంతా

వైసీపీ పాలనలో ఏపీని ‘బీహార్‌ ఆఫ్ సౌత్’ అని పిలుస్తున్నారు: చంద్రబాబు

అమరావతి: వైసీపీ ప్రభుత్వంపై మాజీ సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి విమర్శల వర్షం కురిపించారు. రాష్ట్రంలో పెరుగుతున్న హింసాత్మక ఘటనలతో ఏపీని అంతా ‘బీహార్ ఆఫ్ సౌత్’ అని పిలుస్తున్నారని ఆయన ట్వీట్ చేశారు. 


‘‘విభజన తర్వాత రూ.16వేల కోట్ల లోటు బడ్జెట్‌లో కూడా ఆంధ్రప్రదేశ్.. తెలుగుదేశం పాలనలో తలెత్తుకునేలా ఎదిగింది. 5 ఏళ్లు వరుసగా డబుల్ డిజిట్ గ్రోత్ సాధించింది. పెట్టుబడుల గమ్యస్థానం అయ్యింది. అనేక రంగాలలో దేశంలో నెంబర్ 1 గా మారింది. 5 ఏళ్ల తెలుగుదేశం పాలనలో ఏపీ 667 అవార్డులను సాధించింది. అలాంటిది ఈ రోజు చేతగాని పాలన కారణంగా దేశ విదేశాల్లో తెలుగువారు నవ్వులపాలు అయ్యారు. వైసీపీ నేతల దౌర్జన్యాలను చూసి ‘బీహార్ ఆఫ్ సౌత్’ అని, ‘గవర్నమెంట్ టెర్రరిజం’ అని అంటున్నారు. రివర్స్ టెండరింగ్, పీపీఏల రద్దు, 3 రాజధానులు, కౌన్సిల్ రద్దు.. చర్యలతో రివర్స్ పాలన, తుగ్లక్ 2.0 అన్నారు. గతంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తే ఏపీని చూపించేవారు. ఇప్పుడు వైసీపీ అరాచకాలతో దేశానికే పెట్టుబడులు రాని దుస్థితి. వాటాల కోసం బెదిరించి పెట్టుబడిదారులను తరిమేశారు. దావోస్ సదస్సులో గతంలో ప్రధాన ఆకర్షణగా ఉన్న ఏపీని, వేధింపులకు వేదికగా చేశారు. పాలకులు బాధ్యతగా ప్రవర్తిస్తేనే ప్రజలకు మేలు. ఇలాంటి చేతగాని పాలకులైతే రాష్ట్రం నవ్వుల పాలే’’ అంటూ ఆయన ట్వీట్ చేశారు.

Updated Date - 2020-06-03T02:16:27+05:30 IST