నాలుగో టెస్టులో వింత దృశ్యం.. ఆ సినిమాలోలా..

ABN , First Publish Date - 2021-01-17T04:36:46+05:30 IST

ఆస్ట్రేలియా-భారత్ మధ్య బ్రిస్బేన్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో ఓ వింత దృశ్యం అందరినీ ఆకర్షించింది. స్టేడియంలో మ్యాచ్ చూడటానికి వచ్చిన ప్రేక్షకుల్లో ఓ భాగం.. ప్రఖ్యాత సినిమా స్టార్ వార్స్‌లో పాత్రల్లా వేషం వేసుకొని వచ్చారు.

నాలుగో టెస్టులో వింత దృశ్యం.. ఆ సినిమాలోలా..

బ్రిస్బేన్: ఆస్ట్రేలియా-భారత్ మధ్య బ్రిస్బేన్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో ఓ వింత దృశ్యం అందరినీ ఆకర్షించింది. స్టేడియంలో మ్యాచ్ చూడటానికి వచ్చిన ప్రేక్షకుల్లో ఓ భాగం.. ప్రఖ్యాత సినిమా స్టార్ వార్స్‌లో పాత్రల్లా వేషం వేసుకొని వచ్చారు. వీళ్లు ఆ సినిమాలోలానే డ్యాన్సులు చేస్తూ స్టేడియాన్ని హోరెత్తించారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) కూడా వీరి ఫొటోను షేర్ చేసింది. ‘రెండో రోజు ఆటలో బెస్ట్ డ్రెస్ అప్ అవార్డు వీళ్లకే’ అంటూ ఐసీసీ పోస్టు పెట్టింది. కాగా, రెండో రోజు ఆటకు వర్షం అంతరాయం కలగడంతో మ్యాచ్‌ను అంపైర్లు నిలిపేశారు. ఆట ఆగే సమయానికి భారత జట్టు రెండు వికెట్ల నష్టానికి 66 పరుగులు చేసింది.



Updated Date - 2021-01-17T04:36:46+05:30 IST