Abn logo
Mar 17 2021 @ 16:26PM

ప్రజలు వాస్తవాలు తెలుసుకోవాలి: వర్ల రామయ్య

విజయవాడ: ప్రజలు వాస్తవాలు తెలుసుకోవాలని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య సూచించారు. దళితుల పట్ల సీఎం జగన్‌ చూపిస్తున్న ప్రేమ మొసలి కన్నీరుతో సమానమన్నారు. 30 ఏళ్లుగా దళితులకు చెందిన 690 ఎకరాలు అనుభవించింది మీరు కాదా జగన్‌రెడ్డి? అని వర్ల రామయ్య ప్రశ్నించారు. తెలియకుండానే 30ఏళ్లు అంత భూమిని సాగు చేసుకున్నారా? అని మరోసారి ప్రశ్నించారు. ఇడుపులపాయలోని భూములను దళితులకు ఇచ్చేశామని, జగన్‌రెడ్డి ప్రకటన చేయాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు.