వారణాసిలో వింత ఘటన.. ప్రాణభయంతో ఇళ్లు వదిలి పారిపోతున్న ప్రజలు.. ఆ గ్రామంలో అసలేం జరిగిందంటే..

ABN , First Publish Date - 2021-11-23T12:37:58+05:30 IST

హిందువుల పుణ్యక్షేత్రము, దేశంలోని అతి ప్రాచీన నగరాలలో ఒకటైన వారణాసి(కాశీ)లో ఇటీవల ఒక వింత ఘటన జరిగింది. గంగానది తీరాన వెలసిన ఈ నగరంలో అస్సీ ఘాట్ వద్ద గంగోత్రి కాలనీలో నివసించే కొందరు ప్రజలు అనుకోకుండా తాము నివసించే ఇళ్లను వదిలి పారిపోతున్నారు...

వారణాసిలో వింత ఘటన.. ప్రాణభయంతో ఇళ్లు వదిలి పారిపోతున్న ప్రజలు.. ఆ గ్రామంలో అసలేం జరిగిందంటే..

హిందువుల పుణ్యక్షేత్రము, దేశంలోని అతి ప్రాచీన నగరాలలో ఒకటైన వారణాసి(కాశీ)లో ఇటీవల ఒక వింత ఘటన జరిగింది. గంగానది తీరాన వెలసిన ఈ నగరంలో అస్సీ ఘాట్ వద్ద గంగోత్రి కాలనీలో నివసించే కొందరు ప్రజలు అనుకోకుండా తాము నివసించే ఇళ్లను వదిలి పారిపోతున్నారు. వారిని కారణమడిగితే తాము ఇక ఆ ఇళ్లో ఉండలేమని.. అక్కడ తన ప్రాణాలకు ముప్పు ఉందని అంటున్నారు.


అస్సీ ఘాట్ వద్ద ఉన్న ఇళ్ల పరిస్థితి చూస్తే ఏదో భూకంపం వచ్చినట్లు అనిపిస్తుంది. అక్కడున్న ఇళ్లు మధ్యలో నుంచి రెండుగా చీలిపోయాయి. దాదాపు 35 ఇళ్ల పైకప్పు, వాకిళ్లు విరిగిపోయాయి. ఇప్పటికే చాలామంది ప్రాణభయంతో తమ ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోయారు. ఇంకా కొంతమంది వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. మరికొంతమంది ఎక్కడికి వెళ్లాలో తెలియక తమ ప్రాణాలు గుప్పిట్లో పట్టుకొని అక్కడే ఉన్నారు. దీనంతటికి సరైన కారణం ఎవరికీ తెలియదు. 




మీడియాతో కాలనీవాసులు మాట్లాడుతూ కాలనీ భూభాగం లోపల నుంచి ఒక పెద్ద డ్రైనేజీ పైప్‌లైన్ వేశారని.. దీపావళి రాత్రి నుంచి అది లీకేజీ అవుతోందని చెప్పారు. తమ ఇళ్లు ఇలా కూలిపోతుండడం వెనుక ఆ పైప్ లైన్ కారణం కావచ్చునని చెబుతున్నారు.

అధికారులను వివరణ కోరగా.. "ఆ కాలనీ భూభాగం కింద నుంచి అస్సీ నది నీరు ప్రవహిస్తోంది.. ఆ నది నీరు ఇప్పుడు  కలుషితమై పూర్తిగా మురికి నీరుగా మారింది. ఆ మురికి నీరు గంగా నదిలో వెళ్లి కలుస్తోంది. అందుకే ఆ మురికి నీరుని గంగానదిలో చేరేముందు శుభ్రం చేసేందుకు ఒక పైప్ లైన్ వేశాము. కానీ దాని వల్లే ఇలా ఆ కాలనీలో ఇళ్లు కూలిపోతున్నాయనే దానికి ఆధారాలు లేవు. మేము సమస్యకు కారణమేమిటో తెలుసుకునేందుకు ఒక అధ్యయన బృందం ఏర్పాటు చేశాం. త్వరలో నివేదిక ఆధారంగా సమస్యను పరిష్కరిస్తాం," అని చెప్పారు.

Updated Date - 2021-11-23T12:37:58+05:30 IST