బ్యాంకుల వద్ద పోటెత్తుతున్న జనం

ABN , First Publish Date - 2021-05-11T05:52:43+05:30 IST

కరోనా వైరస్‌ కోరలు చాస్తున్న వేళ బ్యాంకుల వద్ద జనం రద్దీ విపరీతంగా పెరుగుతోంది. రైతు రుణాల రెన్యువల్‌, ఇతర త్రా లావాదేవీల కోసం ఉదయం నుంచే జనం గుంపులు గుంపులుగా ఎగబడుతున్నారు.

బ్యాంకుల వద్ద పోటెత్తుతున్న జనం
ములకలేడు యూనియన బ్యాంకు వద్ద జనసందోహం

భౌతిక దూరం మాటేమరిచారు..

గుంపులు గుంపులుగా ఎగబడుతున్న వైనం

కరోనా వైరస్‌ వ్యాప్తికి హాట్‌స్పాట్‌లుగా బ్యాంకులు


గుత్తి, మే 10: కరోనా వైరస్‌ కోరలు చాస్తున్న వేళ బ్యాంకుల వద్ద జనం రద్దీ విపరీతంగా పెరుగుతోంది. రైతు రుణాల రెన్యువల్‌, ఇతర త్రా లావాదేవీల కోసం ఉదయం నుంచే జనం గుంపులు గుంపులుగా ఎగబడుతున్నారు. భౌతికదూరం మాటేమరిచారు. గుత్తి, గుత్తి ఆర్‌ఎస్‌లోని బ్యాంకుల వద్ద సోమవారం ఖాతాదారులు పోటెత్తారు. కొవి డ్‌ నిబంధనలు పాటించకపోవడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈనేపథ్యంలో వైరస్‌ వ్యాప్తికి బ్యాంకులు హాట్‌స్పాట్‌లుగా మా రుతున్నాయని వాపోతున్నారు.


యాడికిలో షరా మామూలే... 

యాడికి : కరోనా కర్ఫ్యూ అమలులో ఉన్నా సోమవారం స్థానికం గా ఎక్కడ చూసినా జన సందోహమే కనిపించింది. బ్యాంకులు, కూరగాయలు, కిరాణా, చికెన దుకాణాల వద్ద జనాలు గుంపులు గుంపులు గా కనిపించారు. మండలకేంద్రంలోని కెనరా బ్యాంకు, రాయలచెరువు ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకుల వద్ద రుణాల రెన్యువల్‌ కోసం రైతు లు పెద్దఎత్తున తరలివచ్చారు. కరోనా భయంతో మాస్క్‌లు ధరించి నా భౌతికదూరం ఎక్కడా కనిపించలేదు. మధ్యాహ్నం కర్ఫ్యూ సమయంలో కూడా రోడ్లపై జనాల సంచారం ఎక్కువగా కనిపించింది.


ములకలేడులో జనజాతర

శెట్టూరు: మండలంలోని ములకలేడు యునియన బ్యాంకు వద్ద సోమవారం వివిధ గ్రామాల నుంచి పంట రుణాల రెన్యువల్‌ కోసం రైతులు తండోపతండాలుగా తరలిరావడంతో జనజాతరను తలపిం చింది. బ్యాంకు పరిసరప్రాంతమంతా రైతులు గుంపులుగా గుమిగూడారు. కరోనా కర్ఫ్యూ ఆంక్షలు ఏమూలనా కానరాలేదు. కరోనా నిబం ధనలూ అటకెక్కాయి. ఇలా ఉంటే కరోనా మరింత విజృంభించదా అంటూ స్థానికులు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందిం చి ప్రజలు గుమిగూడకుండా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. అ దేవిధంగా లక్ష్మంపల్లి యూనియన బ్యాంకు వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. వడ్డీ మాత్రం కట్టించుకుని పంట రుణాలను రెన్యువల్‌ చే యాలని డిమాండ్‌ చేశారు. కరోనా కష్టకాలంలో వడ్డీ కట్టడానికే డ బ్బు లేకపోతే అసలు, వడ్డీ కట్టాలంటే తాము ఎక్కడి నుంచి తేవాలని బ్యాంకు అధికారులతో వాగ్వాదానికి దిగారు. రైతులకు నచ్చజెప్పి స మస్యలు పరిష్కరించేందుకు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లతామని అధికారులు హామీ ఇచ్చారు.  

Updated Date - 2021-05-11T05:52:43+05:30 IST