మంటల్లో చిక్కుకున్న చిన్నారులు.. హీరోలుగా మారిన స్థానికులు

ABN , First Publish Date - 2021-06-15T02:51:09+05:30 IST

ఒక బిల్డింగులో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో చిక్కుకున్న ముగ్గురు ఇద్దరు చిన్నారులను కాపాడటం కోసం స్థానికులందరూ కలిసి హ్యూమన్ చైన్‌లా మారి బిల్డింగు పక్కనే ఉన్న డ్రైనేజి పైపు పట్టుకొని పైకి ఎక్కేశారు.

మంటల్లో చిక్కుకున్న చిన్నారులు.. హీరోలుగా మారిన స్థానికులు

మాస్కో: ఒక బిల్డింగులో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో చిక్కుకున్న ముగ్గురు ఇద్దరు చిన్నారులను కాపాడటం కోసం స్థానికులందరూ కలిసి హ్యూమన్ చైన్‌లా మారి బిల్డింగు పక్కనే ఉన్న డ్రైనేజి పైపు పట్టుకొని పైకి ఎక్కేశారు. అలా వెళ్లి ఇద్దరు చిన్నారుల ప్రాణాలు కాపాడారు. ఈ ఘటన రష్యాలోని కోస్ట్రోమాలో జరిగింది. ఇక్కడ ఓ వీధిలో ఉన్న ఒక భవంతిలో అగ్నిప్రమాదం జరిగింది. మూడో అంతస్తులో ఇద్దరు చిన్నారులు చిక్కుకుపోయారు. కిటికీ వద్దకొచ్చి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది చూసిన కొందరు వెంటనే భవంతికి ఉన్న డ్రైనేజి పైపు పట్టుకొని పైకి ఎక్కారు. అందరి కన్నా పైన ఉన్న యువకుడు ఒకచేత్తో పైపు పట్టుకొని రెండో చేత్తో కిటికీలోని చిన్నారిని అందుకున్నాడు. అలా అందుకున్న పిల్లలను తన కింద పైపు ఎక్కిన వారికి అందించాడు. ఇలా పైపు ఎక్కిన వాళ్లంతా చేతులు మార్చుకుంటూ చిన్నారులను కిందకు దించారు. వీధి ఆవలవైపు ఉన్న వాళ్లు తీసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ యువకులను హీరోలంటూ నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.

Updated Date - 2021-06-15T02:51:09+05:30 IST