Advertisement
Advertisement
Abn logo
Advertisement

టమాటాల కోసం బారులుతీరిన జనం

రైతుబజారులో కిలో రూ.48..బహిరంగ మార్కెట్‌లో రూ.70

ఎంవీపీకాలనీ, నవంబరు 30: టమాటాల కోసం ఎంవీపీకాలనీ రైతుబజారులో మంగళవారం వినియోగదారులు బారులుతీరారు. బుధవారం ఇక్కడి రైతుబజారుకు సెలవు కావడంతోపాటు మంగళవారం సమీపంలోని పెదవాల్తేరు, సీతమ్మధార రైతుబజార్లకు వారాంతపు సెలవులు కావడంతో టమాటాల కోసం కొనుగోలుదారులు ఎగబడ్డారు. దీంతో మధ్యాహ్నం పన్నెండు గంటలకే టమాటాలు అయిపోయాయి. మొత్తం ఎనిమిది టమాటా కౌంటర్లకు గాను ఆరు మాత్రమే పనిచేయడం, బుధవారం వారాంతపు సెలవు కావడంతో తక్కువ టమాటాలను తీసుకురావడంతో కొరత ఏర్పడింది. ప్రతీరోజు సుమారు 50 క్వింటాళ్ల టమాటాలు వస్తుండగా, బుధవారం 35 క్వింటాళ్లు మాత్రమే వచ్చాయి. కాగా రైతుబజారులో కిలో టమాటా రూ.48కి విక్రయించారు. బహిరంగ మార్కెట్‌లో కిలో రూ.60 నుంచి 70 రూపాయల మధ్య ధరల్లో అమ్ముతున్నారు.


Advertisement
Advertisement