Advertisement
Advertisement
Abn logo
Advertisement
Nov 23 2021 @ 10:10AM

బీహార్ ప్రజలు liquor తాగరు...26న ప్రతిజ్ఞ

 సీఎం నితీష్ కుమార్ వెల్లడి

పాట్నా (బీహార్): బీహార్ రాష్ట్ర ఉద్యోగులు, ప్రజలు మద్యం తాగమని ఈ నెల 26వతేదీన  ప్రతిజ్ఞ చేస్తారని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ చెప్పారు. బీహార్ రాష్ట్రంలో మద్యనిషేధాన్ని కట్టుదిట్టంగా అమలు చేస్తామని సీఎం ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగులైనా మద్యం తాగితే వారిని శిక్షిస్తామని సీఎం హెచ్చరించారు.మద్యనిషేధం పేరుతో అధికారులు పెళ్లి మండపాలపై దాడులు చేసి ప్రజలను వేధిస్తున్నారని విపక్ష ఆర్జేడీ విమర్శించిన నేపథ్యంలో సీఎం మీడియాతో మాట్లాడారు. మద్యనిషేధం పకడ్బందీగా అమలు చేసేందుకు ప్రొహిబిషన్ అధికారులు, పోలీసులు గట్టి చర్యలు తీసుకుంటారని సీఎం చెప్పారు. 

తాము మద్యం తాగేది లేదని, మద్యాన్ని విక్రయించేది లేదని చెపుతూ ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజలు ఈ నెల 26వతేదీన  ప్రతిజ్ఞ చేస్తారని సీఎం వివరించారు.ఫిర్యాదులు వస్తేనే వివాహ వేడుకలపై పోలీసులు దాడులు చేస్తున్నారని సీఎం చెప్పారు. మద్యం తాగుతున్నారని ఫిర్యాదులు అందడంతో 60 హోటళ్లు, వెడ్డింగ్ హాళ్లపై దాడులు చేసి మద్యం తాగేవారిపై కేసులు పెట్టారని సీఎం పేర్కొన్నారు.కాగా వధువు గదిలోకి మహిళా పోలీసు లేకుండా పోలీసులు దాడి చేశారని రబ్రీదేవి విమర్శించారు.

Advertisement
Advertisement