కరోనాపై ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలి

ABN , First Publish Date - 2021-05-11T06:02:42+05:30 IST

కరోనా సెకండ్‌ వేవ్‌ తీవ్రత అధికంగా ఉన్నం దున ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్‌ కమిషనర్‌ వల్లూరి క్రాంతి అన్నారు.

కరోనాపై ప్రజలు  మరింత అప్రమత్తంగా ఉండాలి

మున్సిపల్‌ కమిషనర్‌ వల్లూరి క్రాంతి 


కరీంనగర్‌ టౌన్‌, మే 10: కరోనా సెకండ్‌ వేవ్‌ తీవ్రత అధికంగా ఉన్నం దున ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్‌ కమిషనర్‌ వల్లూరి క్రాంతి అన్నారు. సోమవారం నగరంలో చేపడుతున్న ఇంటింటి సర్వే కార్యక్రమాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. పలు డివిజన్లలో పర్యటించిన ఆమె మున్సిపల్‌, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందితో కలిసి ప్రజల ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. నగరంలోని 60 డివిజన్లలో ఇంటింటి సర్వే చేపడుతున్నామని, ప్రతి రోజు 100 ఇళ్లకు వెళ్లి సర్వే చేయడం జరుగుతుందని చెప్పారు. కొవిడ్‌ లక్షణాలు ఏమైనా ఉన్నవారికి మెడికల్‌ కిట్లను పంపిణీ చేసి హోం ఐసోలేషన్‌లో ఉండి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఒకవేళ ఎవరికైనా కొవి డ్‌ సోకినట్లు అనుమానాలు వస్తే వెంటనే పరీక్షలు చేయించుకుని వైద్యుల సూచనల మేరకు చికిత్సతోపాటు కొవిడ్‌ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వ్యాధి తీవ్రత అధికంగా ఉన్న వారు వెంటనే ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స తీసుకోవాలని, అజాగ్రత్త, నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు. అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని, ఒకవేళ వచ్చినా మాస్క్‌లు ధరించడం, సామాజిక దూరం పాటించడం, చేతులను తరచుగా శుభ్రం చేసుకోవడం వంటి నిబంధనలు పాటించాలని సూచించారు. నగరపాలక సంస్థ పక్షాన కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలు కూడా మరిం త జాగ్రత్తగా ఉండాలని సూచించారు. 

Updated Date - 2021-05-11T06:02:42+05:30 IST