Advertisement
Advertisement
Abn logo
Advertisement

అప్పులు తెచ్చే పాలకులను ప్రజలు హర్షించరు: రఘురామ

ఢిల్లీ: అప్పులు తెచ్చే పాలకులను ప్రజలు హర్షించరని ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోదీ స్ఫూర్తితో పెట్రోల్‌, డీజిల్‌పై రాష్ట్రాలు సుంకాలు తగ్గించాయని తెలిపారు. ఏపీలో కూడా పెట్రోల్, డీజిల్‌ రేట్లను తగ్గించాలని డిమాండ్ చేశారు. లిక్కర్‌ విక్రయాల్లో డిజిటల్‌ పేమెంట్ విధానాన్ని అమలు చేయాలన్నారు. ఏపీలో మద్యం అమ్మకాల లావాదేవీలపై ప్రధానికి లేఖ రాశానని తెలిపారు. డిజిటల్‌ విధానంలో లావాదేవీలు జరిగే విధందా కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరారు. కస్టడీ సందర్భంగా తనను హింసించిన ఘటనపై తన కుమారుడు సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌ ఇంకా విచారణకు రాలేదని తెలిపారు. చాలా సార్లు ప్రస్తావించినా విచారణకు రావడం లేదని, ఎంపీ పరిస్థితే ఇలా ఉంటే.. ఇక సామాన్యుల పరిస్థితేంటి? అని రఘురామకృష్ణరాజు ప్రశ్నించారు.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement