కోవిడ్‌ నివారణపై ప్రజలకు అవగాహన కల్పించాలి

ABN , First Publish Date - 2021-10-15T06:40:15+05:30 IST

కోవిడ్‌ను సమూలంగా నివారించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ అన్నారు.

కోవిడ్‌ నివారణపై ప్రజలకు అవగాహన కల్పించాలి
జెండా ఊపి ప్రచార వాహనాలను ప్రారంభిస్తున్న జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌

 జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ 

సుభాష్‌నగర్‌, అక్టోబరు 14: కోవిడ్‌ను సమూలంగా నివారించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ అన్నారు. హుజురాబాద్‌ ఉప ఎన్నికల సందర్భంగా జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆద్వర్యంలో కోవిడ్‌పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన రెండు ప్రచార వాహనాలను కలెక్టరేట్‌ ఆవరణలో ఆయన జిండా ఊపి ప్రారంబించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా ప్రమాదం పూర్తిగా తొలగిపోలేదన్నారు. కరోనా వైరస్‌ను పూర్తిగా అరికట్టేందుకు తప్పనిసరిగా ప్రతి ఒక్కరు మాస్కులు ధరించాలని, తరుచుగా శానిటైజర్‌తో చేతులను శుభ్రంచేసుకోవాలని, భౌతిక దూరం పాటించాలని సూచించారు. హుజురాబాద్‌ ఉప ఎన్నికల సందర్భంగా నియోజకవర్గ పరిధిలో కోవిడ్‌ నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ నియోజకవర్గంలోని నలుమూలలా ప్రచారం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ గరిమా అగర్వాల్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ మయాంక్‌ మిట్టల్‌, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ జవైరియా, డిప్యూటి డీఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్‌ సుధాకర్‌ రెడ్డి తదితరులు పాల్గోన్నారు.


Updated Date - 2021-10-15T06:40:15+05:30 IST