Abn logo
Sep 24 2021 @ 00:19AM

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

సిరికొండలోని చిక్మాన్‌ వాగులో మేకల కాపరులను తాడు సాయంతో బయటకు తీస్తున్న పోలీస్‌, రెవెన్యూ సిబ్బంది

ఆదిలాబాద్‌టౌన్‌, సెప్టెంబరు 23: ఎగువన భారీ వర్షాలు కురిసి ఉధృతంగా వాగులు ప్రవహిస్తునందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ రాజేశ్‌చంద్ర అన్నారు. గురువారం జిల్లాలో ఆయా మండలాల్లో కురిసిన భారీ వర్షాల దృష్ట్యా పలువురు ఈతకు వెళ్లిన వారు, గొర్రెల కాపరులు, వాగుల్లో చిక్కుకున్న విషయం తెలుసుకున్నారు. ఈ మేరకు పోలీసు ముఖ్య కార్యాలయం నుంచి జిల్లాలోని ఆయా వర్షాప్రభావిత ప్రాంతాల పోలీసు అధికారులతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వరదల్లో చిక్కుకున్న గొర్ల కాపరులు, ఈతకు వెల్లిన వ్యక్తులను కాపాడిన పోలీసులను అభినందించారు. వర్ష ప్రభావిత ప్రాంతాల ప్రజలు అత్యవసర సేవల కోసం 8106674510 లేదా డయల్‌ 100కు సమాచారం అందించాలని కోరారు.

వాగులో చిక్కుకున్న గొర్ల కాపరులు

సిరికొండ: మండల కేంద్రం సమీపంలోని చిక్మాన్‌ వాగులో నలుగురు మేకల, గొర్ల కాపరులు చిక్కుకున్నారు. మండలంలో వారం రోజులుగా ఏకదాటిగా వర్షాలు కురుస్తుండడంతో గురువారం చిక్మాన్‌ వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. అయితే అదే సమయంలో వాగు దాటేందుకు ప్రయత్నించిన నలుగురు మేకల కాపరులు బత్తుల నర్స య్య, అబ్బెన రవి, కాల్వ అంజయ్య, బత్తిని దత్తు వాగు మధ్యలో చిక్కుకున్నారు. దీంతో విషయం తెలుసుకున్న గ్రామస్థులు, రెవెన్యూ, పోలీస్‌ సిబ్బంది అక్కడికి చేరుకుని తాడు సాయంతో వారిని కాపాడారు. ఇందులో తహసీ ల్దార్‌ సర్పరాజ్‌, ఎస్సై కృష్ణకుమార్‌, ఆర్‌ఐ యజ్వెందర్‌ రెడ్డి,  మాజీ సర్పంచ్‌ పెంటన్న, పోలీసు సిబ్బంది ఉన్నారు.