అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు సహకరించాలి

ABN , First Publish Date - 2022-04-07T05:38:05+05:30 IST

నగరపాలక సంస్థ చేపట్టే సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు నగర ప్రజలు పూర్తిస్థాయిలో సహకరించాలని నగర మేయర్‌ వై సునీల్‌రావు కోరారు.

అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు సహకరించాలి
42వ డివిజన్‌లో పర్యటిస్తున్న మేయర్‌ వై సునీల్‌రావు

 నగర మేయర్‌ వై సునీల్‌రావు

కరీంనగర్‌ టౌన్‌, ఏప్రిల్‌ 6: నగరపాలక సంస్థ చేపట్టే సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు నగర ప్రజలు పూర్తిస్థాయిలో సహకరించాలని నగర మేయర్‌ వై సునీల్‌రావు కోరారు. బుధవారం నగరంలోని 42, 9వ డివిజన్లలో మేయర్‌ పర్యటించారు. 42వ డివిజన్‌లో 6 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు స్థానిక కార్పొరేటర్‌ మేచినేని వనజ అశోక్‌రావుతో కలిసి భూమిపూజ చేశారు. 9వ డివిజన్‌ అల్కాపురి ప్రాంతంలో 130 కోట్ల రూపాయల నిధులతో నూతనంగా అత్యాఽధునిక పద్ధతిలో నిర్మించే స్టాం వాటర్‌ డ్రైనేజీ నిర్మాణం కోసం స్థానిక కార్పొరేటర్‌ ఐలేందర్‌ యాదవ్‌తో కలిసి స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మేయర్‌ సునీల్‌రావు మాట్లాడుతూ నగరవ్యాప్తంగా ప్రతి వర్షాకాలంలో ప్రజలు చాలాఈ సమస్యలు ఎదుర్కొంటున్నారని, సమస్యలు ఎదుర్కొంటున్న ప్రాంతాలన్నింటిరి గుర్తించడం జరిగిందన్నారు. స్మార్ట్‌ సిటీలో భాగంగా 130 కోట్ల రూపాయల నిధులు కేటాయించి స్టాం వాటర్‌ డ్రైనీ నిర్మాణం కోసం టెండర్లు పూర్తి చేసి గత కొద్ది రోజుల క్రితమే మంత్రి కేటీఆర్‌ చేతులమీదుగా శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించామని తెలిపారు. వర్షకాలంలో వరద నీటితో ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. స్టాం వాటర్‌ డ్రైనేజీ పనులన్నింటిని జూన్‌ మాసంలోగా పూర్తిచేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. నగరపాలక సంస్థ నుంచి నిధులు కేటాయిచంఇ శిథిలమైన డ్రైనేజీలున్నచోట నూతనంగా డ్రైనేజీలు నిర్మాణం చేస్తున్నామన్నారు. నాణ్యతతో డ్రైన్‌ పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. ఈకార్యక్రమంలో డీఈలు ఓం ప్రకాశ్‌, లచ్చిరెడ్డి, ఏఈ వాణి, డివిజన్‌ ప్రజలు పాల్గొన్నారు. 







Updated Date - 2022-04-07T05:38:05+05:30 IST