Abn logo
Sep 25 2021 @ 00:58AM

దేశవ్యాప్త బంద్‌కు ప్రజలు మద్దతు ఇవ్వాలి

రామన్నపేటలో రౌండ్‌టేబుల్‌ సమావేశంలో మాట్లాడుతున్న అశోక్‌రెడ్డి

భూదాన్‌పోచంపల్లి, మోత్కూరు, గుండాల, రామన్నపేట, సెప్టెంబరు 24: కేంద్రం అమల్లోకి తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌చేస్తూ ఈనెల 27న నిర్వహించనున్న భారత్‌ బంద్‌ను విజయవంతం చేయాలని పలుపార్టీల నేతలు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు జిల్లావ్యాప్తంగా ఆయా మండలాల్లో జరిగిన అఖిలపక్ష రౌండ్‌టేబుల్‌ సమావేశంలో వారు మాట్లాడారు. నిత్యావసర ధరలను నియంత్రించడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయ న్నారు. భూదాన్‌పోచంపల్లిలో జరిగిన సమావేశంలో కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు పాక మల్లేష్‌యాదవ్‌, మర్రి నర్సింహారెడ్డి, పాక మల్లేష్‌, అనిరెడ్డి జగన్‌రెడ్డి, కోట రాంచంద్రారెడ్డి, గోడల్ల భూషణ్‌, గడ్డం వెంకటేష్‌, మంచాల మధు, మోత్కూరులో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా సహాయ కార్యదర్శి బుర్ర అనిల్‌కుమార్‌, నాయకులు ఉపేందర్‌, నరేష్‌, సురేష్‌, సతీష్‌, సుమలత, గుండాలలో సీపీఎం మండల కార్యదర్శి మద్దెపురం రాజు, పింగలి విజయ్‌రెడ్డి, సీఐటీయు మండల కార్యదర్శి పోతర బోయిన సత్యనారా యణ, ఎండీ ఖలీల్‌, రామన్నపేటలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు మేక అశోక్‌రెడ్డి, కాంగ్రెస్‌నేత సాల్వేరు అశోక్‌, సీపీఐ నాయకుడు బాలగోని మల్లయ్య, ఇంటి పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్‌కె.చాంద్‌, సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు జెల్లెల పెంటయ్య, నాయకులు అయ్యాడపు నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.