ఇసుకేస్తే.. చాలు

ABN , First Publish Date - 2021-03-03T05:30:00+05:30 IST

జిల్లాలోని ఏలూరు కార్పొరేషన్‌ సహా, పలు పట్టణాలు చాలా ఇరుకుగా తయారయ్యాయి. ఆటోలు రావడమే గగ నమయ్యేంత ఇరుకు సందులున్న ప్రాంతాల్లో ఇళ్లు నిర్మించుకునేవారి పరిస్థితి అత్యంత సమస్యాత్మ కంగా తయారైంది.

ఇసుకేస్తే.. చాలు
బుధవారం తాడిపూడిలో పోలీసులు పట్టుకున్న ఇసుక లారీ

సెబ్‌ దాడులతో జనం ఉక్కిరి బిక్కిరి

భారీగా పెరిగిన రవాణా చార్జీలు

పట్టుకుంటే వేలకు వేలు వసూళ్లు

ప్రజలకు ఇసుక కష్టాలు

ఏలూరుకు చెందిన ఒకరు ఇటీవల ఆన్‌లైన్‌లో ఇసుక బుక్‌ చేసుకున్నారు. 18 టన్నుల ఇసుక పది టైర్ల లారీలో ఏలూరు చేరుకుంది. ఇంటి నిర్మాణం వద్దకు వెళ్లే అవకాశం లేకపోవడంతో దగ్గరలో వున్న రోడ్డు పక్కన అన్‌లోడ్‌ చేయించుకుని ట్రాక్టర్లతో తరలించుకుంటున్నాడు. అంతే ఎస్‌ఈబీ పోలీసులు అక్కడ వాలిపోయారు. ఇసుక స్మగ్లింగ్‌ కేసు పెడతామని హడావుడి చేశారు. బిల్లులు చూపించినా క్షమించలేదు. అతడు రెండు వేలు వారి చేతిలో పెట్టి దండం పెట్టాడు. 

ఏలూరు, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ఏలూరు కార్పొరేషన్‌ సహా, పలు పట్టణాలు చాలా ఇరుకుగా తయారయ్యాయి. ఆటోలు రావడమే గగ నమయ్యేంత ఇరుకు సందులున్న ప్రాంతాల్లో ఇళ్లు నిర్మించుకునేవారి పరిస్థితి అత్యంత సమస్యాత్మ కంగా తయారైంది. గతంలో ట్రాక్టర్ల ద్వారా ఇసుక తరలించుకునేవారు. ప్రస్తుతం లారీల ద్వారా ఇసుక వస్తోంది. దీంతో వారు ఇంటికి సమీపంలో ఉన్న రోడ్డ పక్కన, లేదా ఖాళీ స్థలంలో ఇసుక పోయించు కుంటున్నారు. దీనిని తరలించుకునేం దుకు కూలి వాళ్లకు అదనంగా మరో రూ.2 వేలు ఇవ్వాల్సి వస్తోంది. ఈ భారం అంతటితో ఆగడం లేదు. ఇలా రోడ్లపై ఇసుక పోయించుకున్న వారిపై ఎస్‌ఈబీ అధికారుల వేధింపులు ఎక్కువయ్యాయి. అక్రమంగా ఇసుక కలిగి ఉన్నారన్న పేరుతో హడా వుడి చేస్తున్నారు. ఇసుక పోయించుకున్న చోటి నుంచి నిర్మాణం వద్దకు ఇసుక తరలించడాన్ని అక్ర మ ఇసుక తరలింపుగా కేసు పెడతామని బెదిరిస్తు న్నారు. బిల్లులు చూపించినా సరే అధికారులు ససే మిరా అంటున్నారు. దీంతో  లంచాలిచ్చి వారి పీడను వదిలించుకోవాల్సి వస్తోంది. 


స్టాక్‌ పాయింట్ల పేర భారీ వడ్డన

పోయిన మార్చిలో లారీ (18 టన్నుల) ఇసుక రూ. 16,500కు అందజేశారు. వర్షాకాలం పేరు చెప్పి స్టాక్‌ పాయింట్ల నుంచి ఇసుక తరలించి హ్యాండ్లింగ్‌ చార్జీ (రీచ్‌ల నుంచి స్టాక్‌ పాయింట్‌కు ఇసుక రవాణా చార్జి) పేరుతో 6 నుంచి 9 వేల వరకూ అదనంగా వసూలుచేశారు. దీంతో ఇసుక ధర రూ.16 నుంచి అమాంతం రూ.26 వేలకు పెరిగింది. దీనికి టోల్‌ చార్జీలు అదనం. ఈ పద్ధతిలో అదనంగా వసూలు చేసే అవకాశం ఉండడంతో స్టాక్‌ పాయింట్ల నుంచి రవాణా చేయడానికే అధికారులు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఫలితంగా ఒక్కో లారీకి వినియోగదారుడు రూ.10 వేలు అదనంగా నష్టపోవాల్సి వస్తోంది. దీనిపై ఆందోళన చేసినా ఫలితం లేదు. గతంలో అను మతించిన రీచ్‌ల గడువు ముగియడం తో అవి మూసేశారు. జిల్లా ఖనిజ వనరుల శాఖ వాటిని తిరిగి కేటాయిం చాల్సి ఉంది. దీనికి సంబంధించి సాం కేతిక సమస్యలు తలెత్తడంతో ఖనిజ వనరుల శాఖ ఈ కేటాయింపుల ప్రక్రి యను తాత్కాలికంగా నిలిపివేసింది. దీంతో రీచ్‌లలో ఇసుక సేకరణ నిలిచి పోయింది. ఇప్పుడు అదే సాకుతో స్టాకు పాయింట్ల నుంచి ఇసుక సరఫరా చేసి వినియో గదారుల జేబులను ఖాళీ చేస్తున్నారు. వీటికి తోడు టోల్‌ చార్జీలు, లోడింగ్‌, అన్‌లోడింగ్‌ చార్జీల పేరుతో మరో రూ.2 వేలు అదనంగా వదులుతోంది. 

స్మగ్లింగ్‌ కేసు పెడతామన్నారు

నేను తాపీ మేస్త్రీని. ఇల్లు కట్టుకుంటూ ఇసుక తెప్పించుకు న్నా. లారీ వచ్చే వీలు లేకపోవడంతో దగ్గరలో ఉన్న రోడ్డు పక్క న ఇసుక పోయించా. దాన్ని కట్టుకునే చోటికి చేరవేస్తుంటే పోలీ సులు అడ్డుకున్నారు. స్మగ్లింగ్‌ కేసు పెడతామని బెదిరించారు. వేదించారు. చేసేదేమీ లేక వారి చేయి తడిపాను.

 రాంబాబు, తాపీ మేస్ర్తి


బిల్లు.. బుట్టాయగూడేనికి – అన్‌లోడింగ్‌.. తాడిపూడిలో

తాళ్లపూడి, మార్చి 3: కంచే చేనుమేస్తే కాపాడెదెవరనే చందంలా ఇసుక దందా కొనసాగుతోంది. అక్రమరవాణా జరగకుండా నిలువరించడానికి ఏపీఎండీసీ సిబ్బంది, పోలీసులు నిఘా ఏర్పాటుచేశారు. అయినా తాడిపూడి ఇసుక ర్యాంపు నుంచి మంగళవారం రాత్రి ఇసుక అక్ర మ రవాణా జరిగింది. బుట్టాయగూడేనికి బిల్లు కొట్టి తాడిపూడిలో అన్‌లోడు చేస్తుండగా పోలీసులకు సమాచారం అందడంతో గుట్టు రట్టయ్యింది. బుట్టాయిగూడేనికి చెందిన మణికంఠ అనే వ్యక్తి ఇసుక బల్క్‌ ఆర్డరు బుక్‌ చేశాడు. అతను బుక్‌ చేసిన ఆర్డరులో మిగిలిన నాలుగు టన్నుల ఇసుక బుట్టాయగూడెం బిల్లు కొట్టి తాడిపూడిలో దించి రావాలని ఏపీఎండీసీ ఉద్యోగి వెంకటేశ్వరరావు, ర్యాంపు గుమస్తా వీరబాబు లారీ ఏర్పాటుచేశారు. డ్రైవరు తాడిపూడిలో ఇసుక డంప్‌ చేస్తుండగా పోలీసులు పట్టుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. దీంతో ఏపీఎండీసీ ఉద్యోగి, గుమస్తా, లారీ డ్రైవరుపై కేసు నమోదు చేసి కోర్టుకు తరలించినట్టు ఎస్‌ఐ సతీశ్‌ తెలిపారు. 

Updated Date - 2021-03-03T05:30:00+05:30 IST