Abn logo
May 8 2021 @ 11:57AM

ఒంగోలులో కోవ్యాక్సిన్ రెండవ డోస్ కోసం బారులు తీరిన ప్రజలు

ప్రకాశం : ఒంగోలులో కోవ్యాక్సిన్ రెండవ డోస్ కోసం ప్రజలు బారులు తీరారు. వ్యాక్సిన్ కోసం రిమ్స్, గాంధీనగర్, వెంకటేశ్వర కాలనీలోని టీకా కేంద్రాల వద్ద భారీ క్యూ లైన్ ఉంది. జిల్లాలో దాదాపు లక్ష మంది వరకూ కోవాక్సిన్ రెండవ డోస్ కోసం ఎదురు చూస్తున్నారు. కేవలం 1300 వైల్స్ కోవాక్సిన్ డోసులు మాత్రమే జిల్లాకు ప్రభుత్వం కేటాయించింది. సరిపడా వ్యాక్సిన్ లేకపోవడంతో ఉదయం నుంచే క్యూలైన్లలో ప్రజలు వేచి ఉన్నారు.


Advertisement