కోవిషీల్డ్ టీకా తీసుకున్న భారత ప్రవాసులు దుబాయ్ వెళ్లొచ్చు.. కానీ..

ABN , First Publish Date - 2021-08-10T14:23:01+05:30 IST

రెండు డోసుల కోవిషీల్డ్ టీకా తీసుకున్న భారత ప్రయాణికులు తిరిగి దుబాయ్‌కు రావొచ్చని ఫ్లై దుబాయ్ అధికారులు యూఏఈలోని ట్రావెల్ ఏజెన్సీలకు సమాచారం అందించారు.

కోవిషీల్డ్ టీకా తీసుకున్న భారత ప్రవాసులు దుబాయ్ వెళ్లొచ్చు.. కానీ..

దుబాయ్: రెండు డోసుల కోవిషీల్డ్ టీకా తీసుకున్న భారత ప్రయాణికులు తిరిగి దుబాయ్‌కు రావొచ్చని ఫ్లై దుబాయ్ అధికారులు యూఏఈలోని ట్రావెల్ ఏజెన్సీలకు సమాచారం అందించారు. అలాగే జర్నీకి 14 రోజుల ముందు రెండో డోసు తీసుకున్న వారికి కూడా ఎంట్రీకి అనుమతి ఉంటుందని పేర్కొన్నారు. అయితే, ప్రయాణికులకు తప్పనిసరిగా దుబాయ్ రెసిడెన్సీ వీసా కలిగి ఉండాలి. అలాగే జర్నీకి 48 గంటల ముందు తీసుకున్న ఆర్‌టీ-పీసీఆర్ టెస్టు నెగెటివ్ సర్టిఫికేట్ చూపించాల్సి ఉంటుంది. దీంతో పాటు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారినర్స్ అఫైర్స్ (జీడీఆర్ఎఫ్ఏ) అనుమతి తీసుకోవడం తప్పనిసరి అని ఈ సందర్భంగా అధికారులు తెలియజేశారు. 

Updated Date - 2021-08-10T14:23:01+05:30 IST