పౌష్ఠికాహార లోపం ఉన్న వారిని గుర్తించాలి

ABN , First Publish Date - 2021-10-19T04:21:12+05:30 IST

గ్రామాల్లో పౌష్ఠికాహార లోపం ఉన్న వారిని గుర్తించి బలమైన ఆహారం అందించేం దుకు కృషి చేయాలని అదనపు కలెక్టర్‌ వరుణ్‌రెడ్డి అన్నారు. సోమవారం జన్కాపూర్‌లోని రైతు వేదికలో ప్రజాప్రతినిధులు, పంచాయతీ కార్యదర్శులకు ఒక రోజు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా అయన మాట్లాడుతూ ప్రజాప్రతి నిధులు, పంచాయతీ కార్యద ర్శులు పౌష్ఠికాహరంపై గ్రామీణులకు అవగాహన కల్పించాలన్నారు.

పౌష్ఠికాహార లోపం ఉన్న వారిని గుర్తించాలి
మాట్లాడుతున్న అదనపు కలెక్టర్‌ వరుణ్‌రెడ్డి

- అదనపుకలెక్టర్‌ వరుణ్‌రెడ్డి

ఆసిఫాబాద్‌రూరల్‌, అక్టోబరు 18: గ్రామాల్లో పౌష్ఠికాహార లోపం ఉన్న వారిని గుర్తించి బలమైన ఆహారం అందించేం దుకు కృషి చేయాలని అదనపు కలెక్టర్‌ వరుణ్‌రెడ్డి అన్నారు. సోమవారం జన్కాపూర్‌లోని రైతు వేదికలో ప్రజాప్రతినిధులు, పంచాయతీ కార్యదర్శులకు ఒక రోజు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా అయన మాట్లాడుతూ ప్రజాప్రతి నిధులు, పంచాయతీ కార్యద ర్శులు పౌష్ఠికాహరంపై గ్రామీణులకు అవగాహన కల్పించాలన్నారు. డీఆర్డీవో సురేందర్‌, జడ్పీటీసీ నాగేశ్వర్‌రావు, ఎంపీపీమల్లిఖార్జున్‌, సీడీపీవో సాదియా, ఎంపీవోప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

వర్ధంతి సభ ఏర్పాట్లు పరిశీలన..

కెరమెరి: ఈనెల 19,20తేదీల్లో జరిగే కుమరం భీం 81వవర్ధంతి సభఏర్పాట్లను సోమవారం అద నపు కలెక్టర్‌ వరుణ్‌రెడ్డి పరిశీలించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ జోడేఘాట్‌ వర్ధంతి సభను అన్నిశాఖలు సమన్వయంతో విజయ వంతం చేయాలని సూచించారు. హట్టి నుంచి జోడేఘాట్‌ వరకు బస్సు సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడా లని అధికారులను ఆదేశించారు. 

క్రీడామైదానాన్ని కేటాయించాలి..

ఆసిఫాబాద్‌: జిల్లాకేంద్రంలో ఉన్నక్రీడా మైదా నాన్ని క్రీడాకారులకు తిరిగి కేటాయించాలని పట్ట ణానికి చెందిన యువకులు, క్రీడాకారులు సోమ వారం అదనపుకలెక్టర్‌ వరుణ్‌రెడ్డికి వినతిపత్రాన్ని అందజేశారు. జిల్లా ఏర్పాటులో బాగంగా మినీ స్టేడియం క్రీడామైదానాన్ని పోలీసు హెడ్‌క్వార్టర్‌కు కేటాయించారన్నారు. దీంతో క్రీడాకారులు, యువ కులు క్రీడలకు దూరమయ్యారన్నారు.

Updated Date - 2021-10-19T04:21:12+05:30 IST