95 శాతం కంటే తక్కువ ఆక్సిజన్ సాచురేషన్ ఉన్నవారికి జిమ్‌లో నో ఎంట్రీ

ABN , First Publish Date - 2020-08-04T16:21:37+05:30 IST

ఆక్సిజన్ సాచురేషన్ శాతం 95 కంటే తక్కువ ఉన్న వారికి జిమ్ లలోకి ప్రవేశం లేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది.....

95 శాతం కంటే తక్కువ ఆక్సిజన్ సాచురేషన్ ఉన్నవారికి జిమ్‌లో నో ఎంట్రీ

న్యూఢిల్లీ : ఆక్సిజన్ సాచురేషన్ శాతం 95 కంటే తక్కువ ఉన్న వారికి జిమ్ లలోకి ప్రవేశం లేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న ప్రస్థుత తరుణంలో ఆక్సిజన్ సాచురేషన్ శాతం 95 కంటే తక్కువ ఉన్న వారిని జిమ్, యోగా స్టూడియోల్లోకి అనుమతించవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఆక్సిజన్ సాచురేషన్ శాతం తక్కువ ఉన్నవారు వెంటనే సమీపంలోని వైద్యకేంద్రాలకు వెళ్లాలని సర్కారు సూచించింది. జిమ్  లు, యోగా కేంద్రాలను తెరిచేందుకు అనుమతించిన సర్కారు ప్రతి ఒక్కరూ 6 అడుగుల సామాజిక దూరం పాటించడంతోపాటు ఫేస్ గార్డులు, మాస్క్ లు తప్పనిసరిగా ధరించాలని కోరింది. యోగా, జిమ్ చేసేటపుడు 15 నుంచి 30 నిమిషాలపాటు వ్యవధి ఇవ్వాలని, 65 ఏళ్ల వారు, అనారోగ్య సమస్యలున్న వారు రావద్దని సర్కారు సూచించింది. 

Updated Date - 2020-08-04T16:21:37+05:30 IST