Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఆ దేవత భక్తుల ఉత్తరాలు చదువుతారట.. మీరూ బాధలు చెప్పుకుంటారా?.. ఈ కథనం మీకోసమే!

ఉత్తరాలకు ఘనమైన చరిత్ర ఉంది. మొబైల్స్, టెలిఫోన్లు లాంటివి లేని కాలంలో ప్రియమైనవారికి ఉత్తరాలు రాసేవారు. ఇప్పుడు ఉత్తరాలు రాయడమనేది ఎక్కడా కనిపించడం లేదు. అయితే కర్నాటకలోని హాసన్‌లో దేవుడికి ఉత్తరాలు రాసి, అందించే దేవాలయం ఒకటి ఉందని మీకు తెలుసా? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఆలయం పేరు హస్నాంబ ఆలయం. ఇది కర్ణాటకలోని ప్రసిద్ధ దేవాలయం. ఈ ఆలయం సంవత్సరంలోని 9 రోజులు మాత్రమే తెరుచుకుంటుంది. మిగిలిన 356 రోజులు మూసివేసివుంటుంది. హస్నాంబ ఆలయాన్ని 12వ శతాబ్దంలో హొయసల వంశ రాజులు నిర్మించారని చెబుతారు. అయితే ప్రధాన ద్వారం వద్ద ఉన్న గోపురం 12వ శతాబ్దానికి చెందినది. గర్భగుడిలో విగ్రహ ప్రతిష్ఠాపన గురించి ఖచ్చితమైన సమాచారం అందుబాటులో లేదు.

అంధకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మ నుంచి వరం పొంది, చాలా దారుణాలు చేయడం మొదలుపెట్టాడు. దీంతో శివుడు తన శక్తులతో యోగేశ్వరిని సృష్టించి ఆమె ద్వారా రాక్షసుడిని అంతం చేయించాడట. యోగేశ్వరితో పాటు ఏడుగురు దేవతలు (సప్తమాత్రిక) బ్రహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి ఈ ఆలయంలో కొలువయ్యారు. ఆలయంలో ప్రతి సంవత్సరం హస్నాంబ మహోత్సవం జరుగుతుంది. ఈ సమయంలో భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుని, అమ్మవారికి తమ కోరికలను ప్రస్తావిస్తూ, ఉత్తరాలు రాసి సమర్పించుకుంటారు. ఈ ఆలయానికి మంగళూరు, బెంగళూరు, శివమొగ్గ,  మైసూర్ నగరాల నుంచి చేరుకోవచ్చు.

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement