పెరవలి బస్‌ షెల్టర్‌లో గుర్తు తెలియని వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2021-01-27T05:47:09+05:30 IST

పెరవలి బస్‌ షెల్టర్‌లో గుర్తు తెలియని ఓ వ్యక్తి మృత దేహాన్ని పెరవలి పోలీసులు కనుగొన్నారు.

పెరవలి బస్‌ షెల్టర్‌లో గుర్తు తెలియని వ్యక్తి మృతి

పెరవలి, జనవరి 26 : పెరవలి బస్‌ షెల్టర్‌లో గుర్తు తెలియని ఓ వ్యక్తి మృత దేహాన్ని పెరవలి పోలీసులు కనుగొన్నారు. ఈ మేరకు ఎస్‌ఐ సూర్యభగవాన్‌ మాట్లాడుతూ అనారోగ్యంతో ఈ వ్యక్తి చనిపోయినట్టు భావిస్తున్నామని 50 ఏళ్ల లోపు వయస్సు కలిగి లేత నీలం రంగు పొడవు చేతుల చొక్కా, బూడిద రంగు ప్యాంట్‌తో ఉన్నాడని ఆచూకీ తెలిసిన వారు 94407 96642 సమాచారం అందింనాలన్నారు.

Updated Date - 2021-01-27T05:47:09+05:30 IST