బాధ్యతతో విధులు నిర్వర్తించాలి

ABN , First Publish Date - 2022-01-20T05:19:53+05:30 IST

బాధ్యతతో విధులు నిర్వర్తించాలని, శాంతిభద్రతలకు సంబంధించి ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఎస్పీ రంజన్‌ రతన్‌కుమార్‌ నూతన పోలీసు సిబ్బందికి సూచించారు.

బాధ్యతతో విధులు నిర్వర్తించాలి
నూతన పోలీసు సిబ్బందికి శిక్షణ ఇస్తున్న దృశ్యం

- ఎస్పీ రంజన్‌ రతన్‌కుమార్‌ 

- నూతన సిబ్బందికి శిక్షణ

గద్వాల క్రైం, జనవరి 19 : బాధ్యతతో విధులు నిర్వర్తించాలని, శాంతిభద్రతలకు సంబంధించి ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఎస్పీ రంజన్‌ రతన్‌కుమార్‌ నూతన పోలీసు సిబ్బందికి సూచించారు. మాబ్‌ అపరేషన్‌, ధర్నాలు, రాస్తారోకోల సందర్భంగా విధుల నిర్వహణ, వీఐపీల బందోబస్తు సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సాయుధ దళ అధికారుల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో బుధవారం రెండవ బ్యాచ్‌ పోలీస్‌ సిబ్బందికి శిక్షణ నిర్వహించారు. కార్యక్రమంలో సాయుధ దళ డీఎస్పీ ఇమ్మానియేల్‌, సిబ్బంది పాల్గొన్నారు. 


Updated Date - 2022-01-20T05:19:53+05:30 IST