3 గంటల్లో తీవ్ర తుఫాన్‌గా ‘తౌక్డే’

ABN , First Publish Date - 2021-05-16T00:42:00+05:30 IST

తౌక్టే తుఫాన్ గోవాకు దక్షిణ నైరుతి దిశగా 290కిమీ దూరంలో ఉంది. రాగల 3 గంటల్లో తీవ్ర తుఫాన్‌గా మారే అవకాశాలున్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం..

3 గంటల్లో తీవ్ర తుఫాన్‌గా ‘తౌక్డే’

హైదరాబాద్‌: తౌక్టే తుఫాన్ గోవాకు దక్షిణ నైరుతి దిశగా 290కిమీ దూరంలో ఉంది. రాగల 3 గంటల్లో తీవ్ర తుఫాన్‌గా మారే అవకాశాలున్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అలాగే తదుపరి 12 గంటల్లో అతి తీవ్ర తుఫాన్‌గా మారుతుందని హెచ్చరికలు జారీ చేసింది. తౌక్టే ఉత్తర వాయువ్య దిశగా ప్రయణించి మరింత బలపడుతుందని, ఈ నెల 18న గుజరాత్‌ తీరం దాటుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే విదర్భ పరిసర ప్రాంతాల్లో ఈ తుఫాన్ ఆవర్తనం బలహీన పడుతుందని చెబుతున్నారు. తౌక్టే తుఫాన్‌ కారణంగా శని, ఆదివారాల్లో ఆంధ్రప్రదేశ్‌లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

Updated Date - 2021-05-16T00:42:00+05:30 IST