‘కుంటాల’ సందర్శనకు అనుమతి

ABN , First Publish Date - 2021-06-22T06:00:19+05:30 IST

కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రంలో లాక్‌డౌన్‌ విధించడంతో కుంటాల జలపాతాన్ని తిలకించేందుకు పర్యా టకులకు అనుమతులను రాష్ట్ర ప్రభుత్వం నిలిపి వేయగా మంగళవారం నుంచి కుంటాల జలపాతాన్ని తిలకించేందుకు పర్యాటకులకు అనుమతి ఇస్తున్నట్లు జిల్లా అటవీశాఖ అధికారి రాజశేఖర్‌ అన్నారు.

‘కుంటాల’ సందర్శనకు అనుమతి

నేరడిగొండ, జూన్‌ 21: కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రంలో లాక్‌డౌన్‌ విధించడంతో కుంటాల జలపాతాన్ని తిలకించేందుకు పర్యా టకులకు అనుమతులను రాష్ట్ర ప్రభుత్వం నిలిపి వేయగా మంగళవారం నుంచి కుంటాల జలపాతాన్ని తిలకించేందుకు పర్యాటకులకు అనుమతి  ఇస్తున్నట్లు జిల్లా అటవీశాఖ అధికారి రాజశేఖర్‌ అన్నారు. సోమవారం మండలంలోని కుంటాల జలపాతాన్ని ఎఫ్‌డీవో ఉట్నుర్‌, రాహుల్‌ కిషన్‌ జాదవ్‌ (ఐఎఫ్‌ఎస్‌)తో కలిసి కుంటాల జలపాతాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుంటాల జలపాతాన్ని తిలకించేం దుకు వచ్చే పర్యాటకులు కరోనా నిబంధనలకు లోబడి రావాలన్నారు.   పర్యాటకులకు ఎలాంటి అ సౌకర్యాలు కలుగకుండా అటవీ శాఖాధి కా రులు చుడాలన్నారు. ఆయన వెంట ఎఫ్‌ఆర్వో వాహెబ్‌ హైమ్మద్‌, ఎఫ్‌ఎస్‌వో వసంత్‌ సిబ్బంది ఉన్నారు.

Updated Date - 2021-06-22T06:00:19+05:30 IST