Abn logo
Sep 28 2021 @ 16:34PM

జంగారెడ్డిగూడెంలో నిబంధనలు చూడకుండానే అనుమతులు: కౌన్సిలర్ రమాదేవి

జంగారెడ్డిగూడెం: పట్టణంలో నూతన గృహ నిర్మాణాలు, వ్యాపార సముదాయాల నిర్మాణాలకు కనీసం నిబంధనలు చూడకుండా అనుమతులు మంజూరు చేస్తున్నారని, దీంతో రోడ్లు, డ్రైన్లు ఆక్రమణలకు గురవుతున్నాయని 5వ వార్డు కౌన్సిలర్ కరుటూరి రమాదేవి (సూర్య విద్యాసంస్థల అధినేత్రి) ఆవేదన వ్యక్తం చేశారు. జంగారెడ్డిగూడెం మున్సిపల్ కార్యాలయంలో జరిగిన మున్సిపల్ కౌన్సిల్ స్థాయి సమావేశంలో రమాదేవి మాట్లాడుతూ ఆయా శాఖల అధికారులు భారీగా లంచాలు తీసుకుంటున్నట్లు ప్రజల్లో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయన్నారు. పట్టణ రోడ్లపై వరదనీరు ఎడతెగకుండా ప్రవాహించడానికి ఈ పరిస్థితే ప్రధాన కారణమంటూ... డ్రైనేజీలలో కొబ్బరి బొండాలు, చెత్త నిండిపోయి పూడుకుపోతున్నాయని ఆమె ఆరోపించారు. ప్రతి అధికారి నిబద్దతతో పనిచేయాలని కోరుతూ కౌన్సిల్ స్థాయి సమావేశంలో జంగారెడ్డిగూడెం పట్టణంలోని పలు సమస్యలను కమిషనర్ దృష్టిలో పెట్టడం జరిగిందని రమాదేవి తెలిపారు. ఈ సమావేశంలో పాల్గొన్న కౌన్సిలర్లు జంగారెడ్డిగూడెంలోని పలు సమస్యలను వివరించారు.

ఇవి కూడా చదవండిImage Caption