రేవంత్‌రెడ్డిపై పేర్ని నాని కౌంటర్‌

ABN , First Publish Date - 2021-10-29T21:13:15+05:30 IST

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ట్వీట్‌పై మంత్రి పేర్ని నాని కౌంటరిచ్చారు. శుక్రవారం ఆయన మీడియాతో రోజూ

రేవంత్‌రెడ్డిపై పేర్ని నాని కౌంటర్‌

అమరావతి: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ట్వీట్‌పై మంత్రి  పేర్ని నాని కౌంటరిచ్చారు. శుక్రవారం ఆయన మీడియాతో రోజూ రాజకీయాల్లో ఉండాలనుకునే వారు ఇలాగే మాట్లాడతారని చెప్పారు. రేవంత్‌కు రోజూ రాజకీయాలు కావాలని విమర్శించారు. సీఎం కేసీఆర్ చెప్పిన మాటలపైనే మాట్లాడానని తెలిపారు. సీఎం జగన్ ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడతారని, ఇలా డొంకతిరుగుడు ఉండదని పేర్ని నాని స్పష్టం చేశారు. ఏ పార్టీ వారైనా డైరెక్ట్‌గా మాట్లాడాలని, నోటితో నవ్వి నొసటితో వెక్కిరించకూడదని సూచించారు. తెలంగాణలో ఒక తీర్మానం చేస్తే రెండు రాష్ట్రాలు కలిసిపోతాయని, మళ్లీ కొత్త పార్టీ ఎందుకు అని పేర్ని నాని ప్రశ్నించారు.

Updated Date - 2021-10-29T21:13:15+05:30 IST