చంద్రబాబు దీక్ష ఎందుకు? ఎవరికోసం?: పేర్ని నాని

ABN , First Publish Date - 2021-10-21T22:40:48+05:30 IST

చంద్రబాబు దీక్ష ఎందుకు? ఎవరికోసం?అని మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. ఇది ఒక క్షుద్ర కార్యక్రమం అని విమర్శించారు.

చంద్రబాబు దీక్ష ఎందుకు? ఎవరికోసం?: పేర్ని నాని

అమరావతి: చంద్రబాబు దీక్ష ఎందుకు? ఎవరికోసం?అని మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. ఇది ఒక క్షుద్ర కార్యక్రమం అని విమర్శించారు. చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. స్క్రిప్టు రాయించి బూతులు తిట్టిస్తారా? అని ఆయన ప్రశ్నించారు. 36 గంటల దీక్ష పేరుతో కొంగ జపం చేస్తున్నారని విమర్శించారు. పార్టీ ఆఫీస్‌లో రెండు బల్లలు విరిగితే రాష్ట్రపతి పాలన పెట్టాలా? అని ప్రశ్నించారు. అమిత్‌షాపై అల్లరిమూకలను ఎగదోసినప్పుడు ఆర్టికల్ 356 గుర్తుకురాలేదా? అని ప్రశ్నించారు. చంద్రబాబు జీవితమంతా నేరమయమని విమర్శించారు. ఇలాంటి ప్రతిపక్షం ఉండడం దురదృష్టమన్నారు. 

Updated Date - 2021-10-21T22:40:48+05:30 IST