Advertisement
Advertisement
Abn logo
Advertisement

9 మంది యువతులను పెళ్లి చేసుకుని.. అనంతరం..

విశాఖ: ఓ వ్యక్తి యువతులను మోసం చేసి వివాహం చేసుకోవడమే కాకుండా.. అనంతరం వారిని వ్యభిచారకూపంలోకి దించుతున్న వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది. తొమ్మిది మంది యువతులను అరుణ్ కుమార్ అనే వ్యక్తి పెళ్లి చేసుకున్నాడు. అనంతరం వారిపై వ్యభిచారం చేయాలంటూ ఒత్తిడి తెచ్చేవాడు. ఒకవేళ వారు అతని మాట వినకపోతే చంపేస్తానని గన్‌తో బెదిరించడమే కాకుండా వారిపై దాడి చేసి చిత్ర హింసలకు గురి చేసేవాడు. తమపై జరిగిన అన్యాయాన్ని బాధితులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లగా.. ఒంటిపై దెబ్బలు చూపించండంటూ పోలీసులు షాక్ ఇచ్చారు. దీంతో తమకు న్యాయం చేయాలంటూ మహిళా చేతన అనే స్వచ్ఛంద సంస్థను బాధితులు ఆశ్రయించారు. గతంలో కూడా అరుణ్ కుమార్ గంజాయి స్మగ్లింగ్‌లో పలుమార్లు జైలు శిక్షను అనుభవించాడు.

Advertisement
Advertisement