Abn logo
Oct 29 2020 @ 21:02PM

జగన్‌కు వ్యక్తిగత ప్రయోజనాలే ముఖ్యం: రామకృష్ణ

Kaakateeya

అమరావతి: సీఎం విధానాలను సీపీఐ నేత రామకృష్ణ తప్పుబట్టారు. జగన్‌కు వ్యక్తిగత ప్రయోజనాలే ముఖ్యమని ఆరోపించారు. అమరావతి రైతుల ఉద్యమాన్ని నీరు గార్చాలని ప్రభుత్వమే కుట్ర చేస్తోందని మండిపడ్డారు. డబ్బులు ఇచ్చి 3 రాజధానులకు మద్దతుగా ప్రభుత్వమే పెయిడ్ ఉద్యమం చేయిస్తోందని విమర్శించారు. పోయేకాలం దాపురించే జగన్‌ ఇలా ప్రవర్తిస్తున్నారని రామకృష్ణ వ్యాఖ్యానించారు. ఏకైక రాజధాని అమరావతి కోసం రైతులు చేస్తోన్న ఉద్యమం గురువారంతో 317వ రోజుకు చేరుకుంది. అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించే వరకు ఉద్యమం కొనసాగిస్తామని రైతులు, ఐకాస నేతలు తెలిపారు. సీఎం జగన్‌ మైండ్‌ సెట్‌ మార్చి అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించేలా చూడాలంటూ రైతులు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement
Advertisement