బ్యాడిగ మిరపను వెంటాడిన తెగుళ్లు, వర్షాలు

ABN , First Publish Date - 2021-12-06T06:17:28+05:30 IST

మండలంలో బ్యాడిగ మిరప సాగు చేసిన రై తులకు చేదు మిగిల్చింది. వరుస వర్షాలకు తోడు తెగుళ్లు పంటను వెంటా డాయి.

బ్యాడిగ మిరపను వెంటాడిన తెగుళ్లు, వర్షాలు
వర్షాలకు దెబ్బతిన్న బ్యాడిగ మిరప పంట

2500 ఎకరాల్లో పంటకు అపార నష్టం

అప్పులపాలైన అన్నదాతలు


కూడేరు, డిసెంబరు 5: మండలంలో బ్యాడిగ మిరప సాగు చేసిన రై తులకు చేదు మిగిల్చింది. వరుస వర్షాలకు తోడు తెగుళ్లు పంటను వెంటా డాయి. మండలవ్యాప్తంగా ఏకంగా 2500 ఎకరాలకుపైగా సాగైన బ్యాడిగ మిరప పంట పూర్తిగా దెబ్బతింది. అపార నష్టంతో అన్నదాత విలవిలలా డుతున్నాడు. మండలంలోని ముద్దలాపురం గ్రామంలో ఈపంటను అత్యధి కంగా 1500 ఎకరాల్లో సాగు చేశారు. మరుట్ల, పీ నారాయణపురం, నాగిరెడ్డిపల్లి, ఇప్పేరు గ్రామాల్లో మరో వెయ్యి ఎకరాల వరకూ సాగులో ఉంది. మిరప పంటకు నల్లి, దోమపోటు, తామర పురుగు ఆశించడంతో పంట పూర్తిగా దెబ్బతింది. దీనికి తోడు అధికవర్షాలు మిరప రైతులను నట్టేట ముంచాయి. తమ గోడు వినేవారు ఎవరంటూ అన్నదాతలు కన్నీరుమున్నీరవుతున్నారు. ఎకరాకు దాదాపు రూ.లక్ష నుంచి రూ.లక్షన్నర వరకూ పెట్టుబడి వస్తోంది. ఒక్కొక్క రైతు నాలుగు ఎకరాల నుంచి ఇరవై ఎకరాల వర కు సాగు చేశారు. పైరు దశ నుంచి కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తు న్నా చివరికి తెగుళ్లతో పాటు వర్షాలకు పంట చేతికి అందకుండా పోయిం ది. ఒక్కొక్క రైతు రూ.6 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు పెట్టుబడులు పెట్టారు. చివరికి పంట పూర్తిగా దెబ్బతిని అన్నదాతకు అప్పులు మిగిలా యి. నెల రోజులుగా కురుస్తున్న వ రుస వర్షాలతో మిరప పంటలో నీ రు నిలిచి కుళ్లియింది. ఎకరాకు ఒక టి లేదా రెండు క్వింటాళ్ల దిగుబడి కూడా రాదని అనప్నోదాతలు వా పోతున్నారు. గత ఏడాది ఎకరాకు 10 నుంచి 15 క్వింటాళ్ల దిగుబడి వ స్తే... ఈ ఏడాది దిగుబడి ఏ మా త్రం లేకుండాపోయింది. ముద్దలాపురంలోనే అధికశాతం బ్యాడిగ మి రపసాగు చేస్తుండటంతో అప్పులపాలైన అన్నదాతలను కదిలిస్తే క న్నీటి గాథలు వినిపిస్తున్నారు. నిత్యం అప్పులతో విలవిలలాడుతున్నామని, దీనికి తోడు బ్యాడిగ మిరప గుదిబండైందని ఆవేదన వ్యక్తం చేశారు.


రూ.8 లక్షలు పెట్టుబడి పెట్టా..

హరినాథ్‌, రైతు, ముద్దలాపురం

రూ.8 లక్షలు పెట్టుబడులు పెట్టి 10 ఎకరాల్లో బ్యాడిగ మిరప సాగుచేశా. తెగుళ్లు, వర్షాలతో పంట పూర్తిగా దెబ్బతింది. అప్పులు చేసి కోటి ఆశలతో పం ట సాగుచేస్తే చివరికి పైసా పెట్టుబడి కూడా రాలే దు. వందల మంది రైతులు పంట సాగు చేసి నష్టాలపాలయ్యారు. ప్రభుత్వం ఆదుకోవాలి.


Updated Date - 2021-12-06T06:17:28+05:30 IST