వైరల్ వీడియో: పెంపుడు కుక్క హీరోయిజం.. ప్రమాదంలో ఉన్న జింక పిల్లను కాపాడిన టామీ

ABN , First Publish Date - 2022-01-24T09:33:44+05:30 IST

విశ్వాసానికి మారుపేరు పెంపుడు కుక్కలు. తమ యజమాని ఏది చెప్పినా వెంటనే ఆ పనిని శిరసావహిస్తాయి. తమ యజమాని కోసమే కాదు.. తమ చుట్టు పక్కల ఎవరు ప్రమాదంలో ఉన్నా కుక్కలు తమ ప్రాణాన్ని లెక్కచేయకుండా కాపాడడానికి ప్రయత్నిస్తాయి. అలాంటి ఒక సంఘటనలో ఒక పెంపుడు కుక్క తన ప్రాణాలు కూడా లెక్క చేయకుండా ప్రమాదంలో ఒక చిన్న జింక పిల్లను...

వైరల్ వీడియో: పెంపుడు కుక్క హీరోయిజం.. ప్రమాదంలో ఉన్న జింక పిల్లను కాపాడిన టామీ

విశ్వాసానికి మారుపేరు పెంపుడు కుక్కలు. తమ యజమాని ఏది చెప్పినా వెంటనే  ఆ పనిని శిరసావహిస్తాయి. తమ యజమాని కోసమే కాదు.. తమ చుట్టు పక్కల ఎవరు  ప్రమాదంలో ఉన్నా కుక్కలు తమ ప్రాణాన్ని లెక్కచేయకుండా కాపాడడానికి ప్రయత్నిస్తాయి. అలాంటి ఒక సంఘటనలో ఒక పెంపుడు కుక్క తన ప్రాణాలు కూడా లెక్క చేయకుండా ప్రమాదంలో ఒక చిన్న జింక పిల్లను కాపాడింది. ఈ దృశ్యానంతా ఆ కుక్క యజమాని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. ఇప్పుడా ఆ వీడియో చూసి నెటిజెన్లు హీరో కుక్కను ప్రశంసిస్తూ కామెంట్లు పెడుతున్నారు.


ఇ వీడియో ఒక చిన్నారి జింక పిల్ల ఉధృతంగా ఉన్న నీటి ప్రవాహంలో చిక్కుకుంది. నీటిలో నుంచి బయటకు వచ్చేందుకు ఎంత ప్రయత్నించినా అది రాలేకపోయింది. పైగా నీటి ప్రవాహానికి ముందుకు కొట్టుకుపోతోంది. ఇది గమనించిన ఒక వ్యక్తి తన పెంపుడు కుక్కను ఆ జింక వైపుకు వదిలాడు. ఆ కుక్క ఉధృతంగా ప్రవహిస్తున్న ఆ కాలువలో దూకి జింక పిల్లను నోట కరుచుకొని ఈత కొడుతూ ఒడ్డుకు చేరుకుంది. ఆ కుక్క యజమాని ఆ జింక పిల్లను కుక్క నోటి నుంచి తీసుకొని పక్కకు వదిలేయగా.. అది చెంగు చెంగుమని పరిగెడుతూ వెళ్లిపోయింది.


ఈ వీడియో తక్కువ సమయంలోనే బాగా వైరల్ అయిపోయింది.



Updated Date - 2022-01-24T09:33:44+05:30 IST