రమురామ కోర్టులో పిటిషన్.. విజయసాయిరెడ్డికి సీబీఐ కోర్టు నోటీసులు

ABN , First Publish Date - 2021-08-07T21:43:18+05:30 IST

ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని ఎంపీ రఘురామకృష్ణరాజు హైదరాబాద్ నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు.

రమురామ కోర్టులో పిటిషన్.. విజయసాయిరెడ్డికి సీబీఐ కోర్టు నోటీసులు

హైదరాబాద్‌: ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని ఎంపీ రఘురామకృష్ణరాజు హైదరాబాద్ నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు. బెయిల్‌ రద్దు పిటిషన్‌పై విచారణలో భాగంగా విజయసాయిరెడ్డికి సీబీఐ కోర్టు నోటీసులిచ్చింది. పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలు చేయాలని ఆయనను కోర్టు ఆదేశించింది. ఈ నెల 10న విజయసాయి బెయిల్‌ రద్దు పిటిషన్‌పై సీబీఐ కోర్టు విచారణ జరుపుతుంది. జగన్‌ అక్రమాస్తుల కేసుల్లో ఏ-2గా ఉన్న విజయసాయిరెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ రఘురామకృష్ణరాజు సీబీఐ కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఆయన తరపు న్యాయవాదులు వెంకటేశ్‌ సిద్దాని, పీఎస్‌ మూర్తి ఈ నెల 3వ తేదీన పిటిషన్‌ దాఖలు చేశారు. రాజ్యసభ ఎంపీగా తనకు కేంద్ర మంత్రులతో సంబంధాలున్నాయంటూ సాక్షులను భయపెడుతున్నారని అందులో పేర్కొన్నారు. 


ఇప్పటికే ఆర్థిక నేరాలు, అక్రమాస్తుల కేసులో 11 చార్జిషీట్లలో ఏ1 ఉన్న జగన్ బెయిల్‌ను రద్దు చేయాలని కోర్టులో రఘురామ పిటిషన్ దాఖలు చేశారు. ఆయన సీఎం పదవిని అడ్డుపెట్టుకుని కేసులను నీరుగారుస్తూ, సీబీఐ అధికారులు, సాక్ష్యాలను ప్రలోభాలకు గురిచేస్తూ నిబంధనలకు విరుద్ధంగా వ్యహరిస్తున్నారని అందువల్ల బెయిల్ రద్దు చేయాలని హైదరాబాద్ నాంపల్లిలోని సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రఘురామ పిటిషన్‌పై కోర్టు విచారణ జరుగుతోంది.

Updated Date - 2021-08-07T21:43:18+05:30 IST