కరోనా కష్టకాలంలో ప్రజలపై పెట్రో భారం

ABN , First Publish Date - 2021-06-12T04:46:26+05:30 IST

కరోనా కష్టకాలంలో ప్రజలపై పెట్రోభారం తీవ్రంగా పడిందని,

కరోనా కష్టకాలంలో ప్రజలపై పెట్రో భారం
ఖమ్మంలో ధర్నా చేస్తున్న సీఎల్పీ నేత భట్టి, కాంగ్రెస్‌ నాయకులు

  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దోచుకుతింటున్నాయి..
  • సీఎల్పీ నేత భట్టి విక్రమార్క  ధ్వజం
  • ఖమ్మంలో కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో నిరసన
  • భద్రాద్రి జిల్లాలోనూ ధర్నాలు


ఖమ్మంసంక్షేమవిభాగం/కొత్తగూడెం, జూన్‌ 11: కరోనా కష్టకాలంలో ప్రజలపై పెట్రోభారం తీవ్రంగా పడిందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల్ని దోచుకుతింటున్నాయని, పెట్రోల్‌, డీజిల్‌ ధరలు అదుపుచేయడంలో విఫలమయ్యా యని, పెట్రో ధరలను వెంటనే తగ్గించాలని సీఎల్పీ నేత, మధిర ఎమ్మెల్యే భట్టి విక్రమార్క డిమాండ్‌ చేశారు. ఏఐసీసీ పిలుపుమేరకు శుక్రవారం ఖమ్మంలో కాంగ్రెస్‌ జిల్లా కమిటీ అధ్వర్యంలో నగరంలో నిరసన ర్యాలీ నిర్వ హించి బంకుల వద్ద ధర్నా చేశారు.


ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ లీటరు పెట్రోల్‌పై కేంద్ర ప్రభు త్వం రూ.33, రాష్ట్ర ప్రభుత్వం రూ.30ప్రజల వద్ద నుంచి వసూలు చేస్తోందని విమర్శించారు. పెట్రోల్‌ ధరల పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం తప్పిం చుకునే ధోరణిలో ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్‌ను తగ్గించి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవా లని డిమాండ్‌ చేశారు. ఓవైపు పెట్రో భారంతో ప్రజలు అల్లాడుతుంటే.. మరో వైపు నిత్యావసరాల రేట్లు కూడా మండిపోతూ సామాన్యులపై తీవ్ర భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.


ఈ నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్‌ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, నగర కాంగ్రెస్‌ అధ్యక్షులు ఎండీ జావీద్‌, మాజీ ఎమ్మెల్సీ పొట్ల నాగేశ్వరరావు, కార్పొరేటర్లు మలీదు వెంకటేశ్వర్లు, దుద్దుకూరి వెంకటేశ్వర్లు, సైదులు, మాజీ కార్పొరేటర్లు యర్రం బాలగంగాదర్‌తిలక్‌, వడ్డెబోయిన నర్సింహారావు, ఓబీసీ జిల్లా చైర్మన్‌ పుచ్చకాయల వీరభద్రం, తదితరులు పాల్గొన్నారు. దీంతో పాటు ఖమ్మం జిల్లాలోని మధిర, వైరా, సత్తుపల్లి, పాలేరు నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్‌ నేతలు ఆందోళనలు చేశారు.


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. కొత్తగూడెం, పాల్వంచ, భద్రాచలం, మణుగూరు, అశ్వారావుపేట, ఇల్లెందు పట్టణాలతోపాటు మండల కేంద్రాల్లో కాంగ్రెస్‌ నాయకుల పెట్రోల్‌ బంకుల ఎదుట ధర్నా చేశారు. పెట్రో ధరలను అదుపులోకి తేవాలని, ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సుమారు 20సార్లు పెట్రోలు, డీజిల్‌ ధరలను పెంచుకుంటూ పోయిందని, లీటర్‌ పెట్రోలు ధర రూ.100కు పైగా పెరిగిందని ఆరోపించారు. పలుచోట్ల జరిగిన ఆందోళనల్లో కాంగ్రెస్‌ భద్రాద్రికొత్తగూడెం జిల్లా నాయకులు ఎడవల్లి కృష్ణ, నాగా సీతారాములు, మోత్కూరి ధర్మారావు, బాలశౌరి, మాళోతు రాందాస్‌ నాయక్‌, చింతలపుడి రాజశేఖర్‌తో పాటు పార్టీ మండలాల అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు. 



Updated Date - 2021-06-12T04:46:26+05:30 IST