Abn logo
Oct 23 2021 @ 02:41AM

వరుసగా మూడో రోజూ ‘పెట్రో’ భారం

న్యూఢిల్లీ, అక్టోబరు 22: దేశవ్యాప్తంగా ‘పెట్రో’ ధరలు ఆల్‌టైమ్‌ గరిష్ఠ స్థాయికి ఎగబాకాయి. శుక్రవారం లీటరు పెట్రోల్‌, డీజిల్‌ మరో 35 పైసలు పెరిగాయి. తాజా పెంపుతో ఢిల్లీలో లీటరు పెట్రోల్‌ ధర రూ.106.89కి, ముంబైలో రూ.112.78కి చేరింది. అదే విధంగా ముంబైలో లీటరు డీజిల్‌ రూ.103.63కు, ఢిల్లీలో రూ.95.62కు పెరిగింది. ఇక హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్‌ ధర రూ.111.18కి, డీజిల్‌ ధర రూ.104.32 స్థాయికి చేరింది.