ఇక ‘జియో-బీపీ’ బ్రాండ్‌ పెట్రో ఉత్పత్తులు

ABN , First Publish Date - 2020-07-10T05:59:55+05:30 IST

పెట్రో ఉత్పత్తుల రిటైల్‌ మార్కెట్లో పోటీ తీవ్రం కాబోతోంది. ఇప్పటి వరకు ఈ మార్కెట్లో ప్రభుత్వ రంగంలోని ఐఓసీ, బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌ కంపెనీలదే హవా. ఈ కంపెనీలకు మున్ముందు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ నుంచి తీవ్ర పోటీ ఎదురుకానుంది...

ఇక ‘జియో-బీపీ’ బ్రాండ్‌ పెట్రో ఉత్పత్తులు

న్యూఢిల్లీ: పెట్రో ఉత్పత్తుల రిటైల్‌ మార్కెట్లో పోటీ తీవ్రం కాబోతోంది. ఇప్పటి వరకు ఈ మార్కెట్లో ప్రభుత్వ రంగంలోని ఐఓసీ, బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌  కంపెనీలదే హవా. ఈ కంపెనీలకు మున్ముందు  రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ నుంచి తీవ్ర పోటీ ఎదురుకానుంది. రిలయన్స్‌ ఇందుకోసం బ్రిటిష్‌ పెట్రోలియం (బీపీ)తో కలిసి గత ఏడాది రిలయన్స్‌ బీపీ మొబిలిటీ లిమిటెడ్‌ (ఆర్‌బీఎంఎల్‌) పేరుతో ఒక జాయింట్‌ వెంచర్‌ కంపెనీని ఏర్పాటు చేసింది. ఈ కంపెనీ  ‘జియో-బీపీ’ పేరు తో తన పెట్రోల్‌, డీజిల్‌, విమాన ఇంధనాల్ని విక్రయించబోతోంది. ఇందుకోసం ప్రస్తుతమున్న 1,400 రిలయ న్స్‌ పెట్రోల్‌ బంకుల్ని వచ్చే ఐదేళ్లలో 5,500కు పెంచాలని నిర్ణయించారు. కాగా భవిష్యత్‌ మార్కెట్‌ను దృష్టి లో పెట్టుకుని రిలయన్స్‌ కార్యకలాపాలు విస్తరిస్తోంది. 


Updated Date - 2020-07-10T05:59:55+05:30 IST