పెట్రోల్‌, డీజిల్‌ ధరలను తగ్గించాలి

ABN , First Publish Date - 2021-06-12T05:45:03+05:30 IST

ఏఐసీసీ, టీపీసీసీ ఇచ్చిన పిలుపులో భాగంగా సిద్దిపేట పాత బస్టాండ్‌ వద్ద పెట్రోల్‌ బంకు ఎదుట కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు దరిపల్లి చంద్రం, ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు బొమ్మల యాదగిరి ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ నాయకులు శుక్రవారం నిరసన నిర్వహించారు.

పెట్రోల్‌, డీజిల్‌ ధరలను తగ్గించాలి
హుస్నాబాద్‌లో కాంగ్రెస్‌ నేతల నిరసన ప్రదర్శన

ఏఐసీసీ, టీపీసీసీ పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా నిరసన తెలిపిన కాంగ్రెస్‌ నాయకులు


సిద్దిపేట టౌన్‌/నంగునూరు/చేర్యాల/కొండపాక/మర్కుక్‌/జగదేవ్‌పూర్‌:  ఏఐసీసీ, టీపీసీసీ ఇచ్చిన పిలుపులో భాగంగా సిద్దిపేట పాత బస్టాండ్‌ వద్ద పెట్రోల్‌ బంకు ఎదుట కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు దరిపల్లి చంద్రం, ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు బొమ్మల యాదగిరి ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ నాయకులు శుక్రవారం నిరసన నిర్వహించారు. నంగునూరులోని ఇండియన్‌ పెట్రోల్‌ బంక్‌ ఎదుట టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి దేవులపల్లి యాదగిరి ఆధ్వర్యంలో, చేర్యాలలోని చుంచనకోట క్రాస్‌ రోడ్డు సమీపంలోని పెట్రోల్‌పంప్‌ వద్ద మున్సిపల్‌ కౌన్సిలర్‌ చెవిటి లింగం, పార్టీ మండలాధ్యక్షుడు ఆది శ్రీనివాస్‌, కొండపాక మండలంలోని వెలికట్ట క్రాస్‌ రోడ్‌ వద్ద మండలాధ్యక్షుడు విరుపాక శ్రీనివా్‌సరెడ్డి, మండల కేంద్రమైన మర్కుక్‌లో కాంగ్రెస్‌ నాయకుల ఆధ్వర్యంలో, జగదేవ్‌పూర్‌లో పెట్రోల్‌ పంపు ఎదుట కాంగ్రెస్‌ మండలాధ్యక్షుడు రవీందర్‌రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. 



లారీకి తాళ్లు కట్టి లాగుతూ నిరసన 

హుస్నాబాద్‌/కోహెడ/మద్దూరు/బెజ్జంకి/అక్కన్నపేట : పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలను నిరసిస్తూ హుస్నాబాద్‌లోని హన్మకొండ రోడ్డు పెట్రోల్‌ పంపు వద్ద శుక్రవారం కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. లారీకి తాళ్లు కట్టి లాగుతూ నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధికార ప్రతినిధి కేడం లింగమూర్తి, కోమటి సత్యనారాయణ, పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు అక్కు శ్రీనివాస్‌ పాల్గొన్నారు. కోహెడలోని కోహెడ - కరీంనగర్‌ ప్రధాన రహదారిపై ఉన్న పెట్రోల్‌ బంకు ఎదుట కాంగ్రెస్‌ మండలాధ్యక్షుడు మంద ధర్మయ్య, మద్దూరులోని పెట్రోల్‌ పంపు ఎదుట మండలాధ్యక్షుడు బండి శ్రీనివాస్‌, యూత్‌ అధ్యక్షుడు చెట్కూరి కమలాకర్‌యాదవ్‌, బెజ్జంకిలోని పెట్రోల్‌ బంకు వద్ద మండలాధ్యక్ష్యుడు చెప్యాల శ్రీనివాస్‌ గౌడ్‌, అక్కన్నపేటలో మండలాధ్యక్షుడు జంగాపల్లి ఐలయ్య ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. 





డీజిల్‌, పెట్రోల్‌ ధరలు పెంచడం దారుణం

దుబ్బాక : విపత్తుకాలంలో ప్రజలు తల్లడిల్లుతుంటే డీజిల్‌, పెట్రోల్‌ ధరల పెంచడం దారుణమని దుబ్బాక నియోజక వర్గ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జి చెరుకు శ్రీనివా్‌సరెడ్డి అన్నారు. శుక్రవారం దుబ్బాకలోని పెట్రోల్‌ బంక్‌ వద్ద డీజిల్‌, పెట్రోల్‌ ధరల పెంపునకు నిరసనగా ధర్నా నిర్వహించారు. 


ఇప్పిస్తామన్న పరిహారం ఏదీ..?

భూనిర్వాసితులకు సిద్దిపేట, గజ్వేల్‌ నియోజక వర్గంలా పరిహారం ఇప్పిస్తామని గెలిచిన ఎమ్మెల్యే పరిహారం ఎందుకు ఇప్పించడం లేదని చెరుకు శ్రీనివా్‌సరెడ్డి ప్రశ్నించారు. గెలిచిన ఆరు నెలల్లో ఇప్పిస్తామని, ఇప్పుడు మ్యాచ్‌ ఫిక్సింగ్‌ అయ్యారన్నారు. అనంతుల శ్రీనివాస్‌, ఏసురెడ్డి, రాజిరెడ్డి పాల్గొన్నారు.  

Updated Date - 2021-06-12T05:45:03+05:30 IST