Abn logo
Sep 19 2021 @ 15:58PM

అఫ్ఘాన్‌లో పెరిగిన పెట్రోల్, గ్యాస్ ధరలు

కాబూల్: అఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌లో ఉన్నట్టుండి పెట్రోల్, గ్యాస్ ధరలు పెరిగాయి. పెట్రోల్ కంపెనీలు రకరకాల పేరుతో అదరపు చార్జీలు వసలూ చేస్తున్నాయని, పెట్రోల్, గ్యాస్ ధరలను తగ్గించాలంటూ కాబూల్‌లోని స్థానికులు తాలిబన్ ప్రభుత్వానికి మొర పెట్టుకుంటున్నారు. పెట్రోల్ లీటర్‌పై నాలుగు అఫ్ఘనీలు పెరిగింది. అలాగే ఒక కిలో గ్యాస్‌పై 15 అఫ్ఘనీలు పెరిగింది.


ఈ విషయమై ఓ స్థానికుడు స్పందిస్తూ ‘‘రోజూ కూలీ పనులు చేసుకుంటే కానీ బతకలేని జనాభే ఎక్కువ ఇక్కడ. వీధుల్లో పనులు చేస్తూ బతుకు వెళ్లదీస్తున్నాం. ఇలాంటి పరిస్థితిలో ఒక కిలో గ్యాస్‌పై 15 అఫ్ఘనీలు పెరిగితే ఎలా కొనగలం? ధరలు ఇంకా పెరుగుతూనే ఉన్నాయి’’ అంటూ బాధను వెల్లగక్కాడు. పెట్రోల్‌ను దిగుమతి చేసుకుంటున్న కంపెనీలే ధరలు పెంచుతున్నాయని కాబూల్‌లో ఉండే వ్యాపాస్థులు చెబుతున్నారు.