జెట్ ఫ్యూయల్ కంటే పెట్రోల్ ధర ఎక్కువ...

ABN , First Publish Date - 2021-10-20T01:25:52+05:30 IST

ఎప్పటికప్పుడు పెరుగుతూ వస్తోన్న పెట్రోల్, డీజిల్ ధరలు మంగళవారం(అక్టోబరు 19) స్థిరంగా ఉన్నాయి. మొన్నటివరకు వరుసగా నాలుగో ఆదివారం ధరలు పెరిగిర విఫమం తోలిపిందు. సోమవారం లీటర్ పెట్రోల్ పై 35 పైసలు, లీటర్ డీజిల్ పైన 35 పైసల వరకు పెరిగింది.

జెట్ ఫ్యూయల్ కంటే పెట్రోల్ ధర ఎక్కువ...

ముంబై : ఎప్పటికప్పుడు పెరుగుతూ వస్తోన్న  పెట్రోల్, డీజిల్ ధరలు మంగళవారం(అక్టోబరు 19) స్థిరంగా ఉన్నాయి. మొన్నటివరకు వరుసగా నాలుగో ఆదివారం ధరలు పెరిగిర విఫమం తోలిపిందు. సోమవారం లీటర్ పెట్రోల్ పై 35 పైసలు, లీటర్ డీజిల్ పైన 35 పైసల వరకు పెరిగింది. ఈ పెరుగుదలతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ. 106 కు చేరువ కాగా, హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో రూ. 110 కి చేరువైంది. ఈ అక్టోబరు  నెలలో లీటర్ పెట్రోల్, లీటర్ డీజిల్ పైన రూ. 4 వరకు పెరిగింది. దీంతో దేశ రాజధాని న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ. 105.84, లీటర్ డీజిల్ రూ. 94.57గా ఉన్నాయి. 


తాజా సవరణ అనంతరం దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ రూ. 111.77 గా ఉంది. డీజిల్ ధర లీటర్ రూ. 102.52.  కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ రూ. 106.43, డీజిల్ రూ. 97.68, చెన్నైలో పెట్రోల్ రూ. 103.01, డీజిల్ రూ. 98.92, బెంగళూరులో లీటర్ పెట్రోల్ రూ. 109.53, డీజిల్ రూ. 100.37, హైదరాబాద్‌లో పెట్రోల్ రూ. 110.09, డీజిల్ రూ. 103.08గా ఉంది. కాగా... వాహన ఇంధన ధరలు విమానాల్లో  ఉపయోగించే ఏటీఎఫ్ కంటే ప్రస్తుతం 30 శాతం అధికంగా ఉండడం గమనార్హం. ఢిల్లీలో ఏటీఎఫ్ లీటర్‌కు రూ. 79 లేదా కిలో లీటర్‌కు రూ. 79,020.16 గా ఉంది. ఢిల్లీలో అదే లీటర్ పెట్రోల్ ధర రూ. 106 వద్ద ఉంది. అంటే ఏటీఎఫ్ కంటే పెట్రోల్ 30 శాతం అధికంగా ఉంది. రాజస్థాన్‌లోని గంగానగర్‌లో లీటర్ పెట్రోల్ ఏకంగా రూ. 117.86 వద్ద ఉంది. లీటర్ డీజిల్ రూ. 105.95 వద్ద ఉంది.


జెట్ ఫ్యూయల్ కంటే పెట్రోల్ ధర 30 శాతం  అధికం...

కరోనా సెకండ్ వేవ్ తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు కొద్ది నెలలపాటు పెరగలేదు. గత నెల నుండి పెరుగుతూ వస్తున్నాయి. పెట్రోల్ ధరలు రెండు నెలల తర్వాత ఇటీవల పెరిగాయి. అంతకుముందు పెట్రోల్ ధరలు చివరిసారి జూలై 17 న పెరిగాయి. రెండు నెలలకు పైగా స్థిరంగా, లేదా స్వల్పంగా తగ్గిన పెట్రోల్ ధరలు గత నెల చివరి నుండి మళ్లీ పెరగడం ప్రారంభమైంది. డీజిల్ ధరలు జూలై 15 నుండి పెరగలేదు. ఇటీవల మళ్లీ పెరుగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌కు అణుగుణంగా కొద్ది రోజుల క్రితం వరకు తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు... ఇప్పుడు అక్కడ పెరుగుతుండడంతో ఇక్కడ కూడా పెరుగుతున్నాయి.

Updated Date - 2021-10-20T01:25:52+05:30 IST