ఢిల్లీలో వంద రూపాయలు దాటిన పెట్రోల్ ధర

ABN , First Publish Date - 2021-07-07T15:55:30+05:30 IST

దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో బుధవారం లీటరు పెట్రోల్ ధర వందరూపాయల మార్కును దాటింది....

ఢిల్లీలో వంద రూపాయలు దాటిన పెట్రోల్ ధర

16 రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి...

న్యూఢిల్లీ : దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో బుధవారం లీటరు పెట్రోల్ ధర వందరూపాయల మార్కును దాటింది.ఢిల్లీలో బుధవారం లీటరు పెట్రోలు ధర రూ.100.21 లకు చేరింది. దేశ రాజధానిలో డీజిల్ లీటరు ధర 89.53రూపాయలకు పెరిగింది. ఢిల్లీతోపాటు కోల్ కతా నగరంలోనూ పెట్రోలు ధర వందరూపాయలు దాటింది. దేశ ఆర్థిక రాజధాని నగరంగా పేరొందిన ముంబైలో లీటరు పెట్రోలు ధర బుధవారం 106.27 రూపాయలైంది. చెన్నై నగరంలోనూ పెట్రోలు ధర 101.1 రూపాయలకు పెరిగింది. 



ఢిల్లీ, పశ్చిమబెంగాల్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, జమ్మూ అండ్ కశ్మీర్, ఒడిశా, తమిళనాడు, కేరళ, బీహార్, పంజాబ్, సిక్కిం, లఢఖ్ లలో పెట్రోలు ధర వందరూపాయల మార్కును దాటింది.అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధరలు పెరగడంతో పెట్రోలు ధరలకు రెక్కలు వచ్చాయి. తరచూ పెరుగుతున్న పెట్రోలు ధరలతో్ సామాన్యులపై అదనపు ఆర్థిక భారం పడనుంది.

Updated Date - 2021-07-07T15:55:30+05:30 IST