Petrol Price Today: ఈరోజు పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే...

ABN , First Publish Date - 2021-08-26T13:20:49+05:30 IST

దేశంలోని ప్రభుత్వరంగ చమురు సంస్థలు తాజాగా...

Petrol Price Today: ఈరోజు పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే...

న్యూఢిల్లీ: దేశంలోని ప్రభుత్వరంగ చమురు సంస్థలు తాజాగా పెట్రోల్, డీజిల్ రేట్లను విడుదల చేశాయి. ఈరోజు వరుసగా రెండవ రోజు కూడా పెట్రోల్-డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు చోటుచేసుకోలేదు. అంతకుముందు మంగళవారం, పెట్రోల్ ధర లీటరుకు 15 పైసలు తగ్గింది. అదే సమయంలో డీజిల్ ధర లీటరుకు 15 పైసల మేరకు ఉపశమనం లభించింది. రాజధాని ఢిల్లీలో పెట్రోల్ రూ. 101.49, డీజిల్ రూ. 88.92 వద్ద స్థిరంగా ఉంది. 


దేశవ్యాప్తంగా సుమారు 19 రాష్ట్రాల్లో పెట్రోల్ ధర రూ .100 దాటింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, ఒడిశా, జమ్మూకశ్మీర్, లడఖ్ ఈ జాబితాలో ఉన్నాయి. ముంబై, హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో ఇంతకుమునుపే పెట్రోల్ ధర లీటరుకు రూ.100 దాటింది.

ప్రస్తుతం దేశంలోని వివిధ నగరాల్లో లీటరు పెట్రోల్, డీజిల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి.

ఢిల్లీ- పెట్రోల్ రూ. 101.49... డీజిల్ రూ. 88.92 

ముంబై- పెట్రోల్ రూ. 107.52... డీజిల్ రూ .96.48

చెన్నై- పెట్రోల్ రూ. 99.20... డీజిల్ రూ. 93.52

కోల్‌కతా- పెట్రోల్ రూ. 101.82... డీజిల్ రూ. 91.98

భోపాల్- పెట్రోల్ రూ. 109.91... డీజిల్ రూ. 97.72

హైదరాబాద్‌- పెట్రోల్ రూ.105.54... డీజిల్ రూ.96.99


Updated Date - 2021-08-26T13:20:49+05:30 IST