వరుసగా ఐదవ రోజూ స్థిరంగా పెట్రోల్, డీజిల్ ధరలు!

ABN , First Publish Date - 2021-07-22T13:13:22+05:30 IST

ప్రభుత్వ చమురు సంస్థలు వరుసగా ఐదవ రోజు కూడా...

వరుసగా ఐదవ రోజూ స్థిరంగా పెట్రోల్, డీజిల్ ధరలు!

న్యూఢిల్లీ: ప్రభుత్వ చమురు సంస్థలు వరుసగా ఐదవ రోజు కూడా పెట్రోల్, డీజిల్ ధరలలో మార్పులు తీసుకురాలేదు. గడచిన శనివారం నుంచి డీజిల్ ధరలో ఎటువంటి మార్పు చోటుచేసుకోలేదు. పెట్రోల్ ధర మాత్రం 29 పైసలు నుంచి 30 పైసలుకు పెరిగింది.  ఆ తరువాత పెట్రోల్, డీజిల్ ధరలలో పెరుగుదల చోటుచేసుకోలేదు. ఈరోజు ఢిల్లీలో లీటరు పెట్రోలు ధర రూ. 101.84 గా ఉండగా, డీజిల్ ధర లీటరు రూ.89.87 గా ఉంది. ఇక ముంబైలో లీటరు పెట్రోలు రూ.107.83కు లభిస్తుండగా, డీజిల్ ధర రూ. 97.45గా ఉంది. కోల్‌కతా విషయానికొస్తే లీటరు పెట్రోల్ ధర రూ. 102.08గా ఉండగా, డీజిల్ ధర రూ.93.02గా ఉంది. చెన్నైలో లీటరు పెట్రోల్ ధర వంద రూపాయలు దాటి 102.49కి చేరగా డీజిల్ ధర రూ.94.39గా ఉంది.

Updated Date - 2021-07-22T13:13:22+05:30 IST