Abn logo
May 4 2021 @ 07:04AM

18 రోజుల తర్వాత మళ్లీ పెరిగిన పెట్రోల్ ధరలు

న్యూఢిల్లీ : దేశంలో 18 రోజుల విరామం తర్వాత మంగళవారం పెట్రోల్, డీజిల్ ధరలను చమురు మార్కెటింగ్ కంపెనీలు పెంచాయి. దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుు 15 పైసలు, డీజిల్ ధర లీటరుకు 16 పైసలు పెంచారు. గత నెల 15వతేదీన పెట్రోల్ ధర లీటరుకు 16 పైసలు, డీజిల్ ను 14 పైసలు తగ్గించారు. కేంద్రప్రభుత్వ యాజమాన్యంలోని ఇంధన రిటైలర్ల ధర తాజా నోటిఫికేషన్ ప్రకారం ఢిల్లీలో లీటరు పెట్రోలు ధర 90.56 రూపాయలకు పెరిగింది. లీటరు డీజిల్ ధర 80.73 రూపాయలకు పెరిగింది. గత ఏడాది పెట్రోల్ ధర లీటరుకు 21.58 రూపాయలు, డీజిల్ ధర లీటరుకు 19.18రూపాయలు పెరిగింది. ముంబై నగరంలో పెట్రోల్ లీటరు ధర 96.83రూపాయలు, డీజిల్ ధర 87.81రూపాయలకు పెరిగింది. చెన్నై నగరంలో పెట్రోలు 92.43, డీజిల్ 85.75 రూపాయలకు, కోల్ కతాలో పెట్రోల్ రూ.90.62, డీజిల్ లీటరు ధర 83.61 రూపాయలకు పెరిగింది. 

ఢిల్లీలో కేంద్రప్రభుత్వం లీటరు పెట్రోల్ ధర 32.98 రూపాయలుండగా, దీనిపై రాష్ట్ర ప్రభుత్వ అమ్మకపు పన్ను వ్యాట్ రూ.19.55గా ఉంది. లీటరు డీజిల్ పై సెంట్రల్ ఎక్సైజ్ రూ.31.83, వ్యాట్ రూ.10.99 రూపాయలు వసూలు చేస్తోంది. దీంతోపాటు పెట్రోలు లీటరుకు రూ.2.6, డీజిల్ పై రెండు రూపాయల చొప్పున డీలర్ కమిషన్ కూడా ఉంది. ముడిచమురు అంతర్జాతీయ మార్కెటులో బ్యారెల్ ధర 66 డాలర్లకు దాటింది. కొవిడ్ కారణంగా దేశంలో మొత్తం ఇంధన డిమాండ్ 7 శాతం తగ్గిందని భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ మార్కెటింగ్, శుద్ధి కర్మాగారాల డైరెక్టర్ అరుణ్ సింగ్ చెప్పారు. 

Advertisement
Advertisement
Advertisement