15 నగరాల్లో వంద రూపాయలు దాటేసిన పెట్రోలు ధర

ABN , First Publish Date - 2021-06-18T23:12:58+05:30 IST

దేశంలో పెట్రో ధరలు శుక్రవారం మరోమారు పెరిగాయి. మే 4 తర్వాత ధరలు పెరగడం ఇది 26వ సారి.

15 నగరాల్లో వంద రూపాయలు దాటేసిన పెట్రోలు ధర

న్యూఢిల్లీ: దేశంలో పెట్రో ధరలు శుక్రవారం మరోమారు పెరిగాయి. మే 4 తర్వాత ధరలు పెరగడం ఇది 26వ సారి. ప్రభుత్వం రంగ చమురు సంస్థలు నేడు పెట్రోలుపై 27 పైసలు, డీజిల్‌పై 28 పైసలు పెంచాయి. ఫలితంగా దేశంలో  15కు పైగా నగరాల్లో పెట్రోలు ధర 100 రూపాయలు దాటేసింది. మహారాష్ట్ర, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, తెలంగాణలోని పలు నగరాల్లో పెట్రోలు ధర లీటరు ఇప్పుడు రూ. 100కుపైనే ఉంది. కేంద్ర పాలిత ప్రాంతమైన లడఖ్‌లోనూ పెట్రోలు ధర సెంచరీ దాటింది.


రాజస్థాన్‌లోని శ్రీ గంగానగర్‌లో లీటరు పెట్రోలు ధర రూ. 108 కాగా, డీజిల్ ధర రూ. 100 దాటేసింది. లీటరు పెట్రోలు వంద రూపాయలు దాటిన మొదటి మెట్రో సిటీ ముంబై. ఇప్పుడిక్కడ లీటరు పెట్రోలు ధర రూ. 103.08గా ఉండగా, బెంగళూరులో తాజా పెంపు తర్వాత రూ. 100గా ఉంది. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో లీటరు పెట్రోలు ధర రూ. 104 కాగా, ఔరంగాబాద్‌లో రూ. 104.06, గ్వాలియర్‌లో రూ. 105.48, జై సల్మేర్‌లో రూ. 104.81, ఇండోర్‌లో రూ. 105.14, ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో రూ. 102.80, చిక్‌మగళూరులో రూ. 101.06, శివమొగ్గలో రూ. 100.80, బన్సవరలో రూ. 104.68, పర్భానిలో రూ. 105.63, ఏపీలోని కాకినాడలో రూ. 103.31గా ఉంది. 

Updated Date - 2021-06-18T23:12:58+05:30 IST