Abn logo
Aug 25 2021 @ 20:36PM

పెట్రోల్‌ ధరలు భరించలేక బైక్‌ దహనం

గద్వాల: రోజు రోజుకు పెరుగుతున్న పెట్రోల్‌ ధరలతో విసుగెత్తిపోయిన ఓ వ్యక్తి తన వాహనానికి నిప్పంటించి దహనం చేశాడు. జోగులాంబ గద్వాల జిల్లా ధరూరు మండల కేంద్రానికి చెందిన కుర్వ ఆంజనేయులు బుధవారం మధ్యాహ్నం స్థానిక వైఎస్‌ఆర్‌ చౌరస్తాలో అకస్మాత్తుగా తన ద్విచక్ర వాహనానికి నిప్పంటించాడు. స్థానికులు గమనించి ద్విచక్ర వాహనంపై నీరుపోసి మంటలను ఆర్పారు. తాను వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నానని, పెట్రోల్‌ అధిక ధరలు పెనుభారంగా మారాయని ఆంజనేయులు ఆవేదన వ్యక్తం చేశాడు. మోటారు సైకిల్‌కు పెట్రోల్ పోయించలేని స్థితిలో విసుగు చెంది దహనం చేసినట్లు చెప్పాడు.

క్రైమ్ మరిన్ని...