మళ్లీ పెరిగిన పెట్రోలు, డీజిల్ ధరలు

ABN , First Publish Date - 2021-01-19T14:22:40+05:30 IST

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మంగళవారం మరోసారి పెరిగాయి....

మళ్లీ పెరిగిన పెట్రోలు, డీజిల్ ధరలు

ఎగబాకుతున్న ముడిచమురు ధరలు

లీటరుకు 25 పైసల పెంపు

న్యూఢిల్లీ: పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మంగళవారం మరోసారి పెరిగాయి. తాజాగా మంగళవారం పెట్రోలు లీటరు ధర మరో 25 పైసలు పెరిగింది. దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో పెట్రోలు లీటరు ధర 85 రూపాయలు దాటింది. సోమవారం పెట్రోల్‌, డీజిల్‌ ధరలను 25 పైసల చొప్పున కంపెనీలు పెంచాయి. మంగళవారం మరోసారి పెంచాయి. దీంతో ఢిల్లీలో లీటరు పెట్రోల్‌ ధర జీవిత కాల గరిష్ఠ స్థాయి రూ.85.20కు చేరింది. డీజిల్‌ ధర రూ.75.38కి పెరిగింది. దేశంలో అతిపెద్ద ఇంధన రిటైలర్ అయిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ముంబైలో లీటరు పెట్రోలు ధర 91.80 రూపాయలకు పెంచింది. ముంబైలో డీజిల్ లీటరు ధర 82.13 రూపాయలకు పెరిగింది.చెన్నైలో లీటరు పెట్రోల్‌ ధర రూ.87.85, డీజిల్‌ ధర రూ.80.67, కోల్‌కతాలో పెట్రోల్‌ ధర రూ.86.63, డీజిల్‌ ధర రూ.78.97గా ఉన్నాయి. కరోనా మహమ్మారి అనంతరం పలు దేశాల్లో ఇంధన వినియోగం పెరిగింది. దీంతో   అంతర్జాతీయంగా ఇంధనాలకు డిమాండ్‌  ఏర్పడింది. ముడిచమురు ధరలు పెరుగుతుండటంతో దానికి అనుగుణంగా పెట్రో ధరలను చమురు విక్రయ కంపెనీలు పెంచుతున్నాయి. 

Updated Date - 2021-01-19T14:22:40+05:30 IST