పెరిగిన పెట్రో ధరలు.. హుస్సేన్‌సాగర్‌లో బైకు పడేసి నిరసన

ABN , First Publish Date - 2021-06-11T21:25:11+05:30 IST

పెట్రోల్, డీజిల్ ధరలను వ్యతిరేకిస్తూ హైదరాబాద్ యూత్ కాంగ్రెస్ నేతలు వినూత్నరీతిలో నిరసన తెలిపారు. యువ నేత శైలేందర్ ఇతర యూత లీడర్లు పల్సర్ బైకును ట్యాంక్ బండ్‌లో పడేశారు.

పెరిగిన పెట్రో ధరలు.. హుస్సేన్‌సాగర్‌లో బైకు పడేసి నిరసన

హైదరాబాద్: పెట్రోల్, డీజిల్ ధరలను వ్యతిరేకిస్తూ హైదరాబాద్ యూత్ కాంగ్రెస్ నేతలు వినూత్నరీతిలో నిరసన తెలిపారు. యువ నేత శైలేందర్ ఇతర యూత లీడర్లు పల్సర్ బైకును ట్యాంక్ బండ్‌లో పడేశారు. బైకును నడుపుకుంటూ హుస్సేన్ సాగర్‌కు వద్దకు రాగానే యూత్ కాంగ్రెస్ నేతలంతా బైకును సాగర్‌లో విసిరేశారు. పెంచిన డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నేతలు నినాదాలు చేశారు.


పెంచిన డీజిల్‌, పెట్రోల్‌ ధరలను వెంటనే ఉపసంహరించాలనే డిమాండ్‌తో శుక్రవారం పెట్రోల్‌ బంకుల వద్ద కాంగ్రెస్‌ దేశవ్యాప్త నిరసనకు పిలుపునిచ్చింది. అధిష్టానం పిలుపుతో జిల్లా, మండల కేంద్రాల్లో ఆందోళనలు నిర్వహించాలని టీపీసీసీ నిర్ణయం తీసుకుంది. కరోనా వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నా పెట్రో ధరలను కేంద్రం పెంచుతూనే ఉందని, గత 13 నెలల్లో లీటరు పెట్రోల్‌పై రూ. 25.72, డీజిల్‌పై 23.93 మేరకు ధరలు పెంచడం దారుణమని మండిపడింది. ప్రజా దోపిడీకి ఇదో ఉదాహరణ అని, దీనికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని ఏఐసీసీ పిలుపునిచ్చింది. 



Updated Date - 2021-06-11T21:25:11+05:30 IST